Asia-Cup-Final
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Ind Vs Pak Final: ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, పాండ్యా ఆడడం లేదా?.. కోచ్ షాకింగ్ అప్‌డేట్

Ind Vs Pak Final: ఆసియా కప్-2025 విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదులు భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 28) రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ (Ind Vs Pak Final) జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇద్దరూ శ్రీలంక మ్యాచ్‌ ఫీల్డింగ్ సమయంలో  కండరాల నొప్పి (క్రమ్స్) కారణంగా మైదానాన్ని వీడాల్సి వచ్చిందని చెప్పాడు.

ఈ మేరకు పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ మాట్లాడాడు. ఇద్దరు ప్లేయర్లు కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డారని చెప్పాడు. హార్దిక్ పాండ్యా పరిస్థితిని రాత్రి, రేపు (ఆదివారం) ఉదయం మరింత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పాడు. కానీ, అభిషేక్ శర్మకు కాస్త ఫర్వాలేదన్నాడు. కానీ, ఇద్దరూ కండరాల నొప్పితో బాధపడుతున్నారని మోర్నే మోర్కెల్ వివరించాడు.

Read Also- Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

కాగా, శ్రీలంకపై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ, ఆ తర్వాత బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. ఇక, శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలోనే అభిషేక్ శర్మ కూడా మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో రింకూ సింగ్ వచ్చి ఫీల్డింగ్ చేశాడు. ఇద్దరూ కండరాల నొప్పితో బాధపడుతుండడంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది.

ఏం కాదులే మినహాయింపు ఇద్దాం, జట్టులోకి తీసుకుందామనే సంస్కృతిని దూరం చేస్తున్నామని, ప్లేయర్లు ట్రైనింగ్‌లో ఎంత కష్టపడ్డారో అంచనా వేస్తామని, ప్లేయర్లు మైదానంలోకి దిగి ఫలితం ఇవ్వాలని ఆశిస్తున్నామని మోర్నే మోర్కెల్ స్పష్టం చేశాడు. ‘‘కొన్నిసార్లు సన్నద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం లభించదు. నెట్స్‌లో ఎంతసేపైనా బౌలింగ్ చేయవచ్చు, కానీ మ్యాచ్‌లో బౌలింగ్ చేయడం వేరు. ఒక జట్టుగా అందరూ కలిసి మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం టీమ్ గెలుస్తోంది. ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఏదో ఒకరోజు ఎక్స్ ఫాక్టర్లుగా, మ్యాచ్ విజేతలుగా నిలుస్తారు’’ అని మోర్నే మోర్కెల్ వ్యాఖ్యానించాడు.

Read Also- Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు

కాగా, ఆసియా కప్ సూపర్-4 దశలో చివరి మ్యాచ్ భారత్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం రాత్ర జరిగింది. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. కాగా, శ్రీలంకపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించినప్పటికీ భారత పేసర్లు భారీగా పరుగులు సాధించారు. అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి 46 పరుగులు సాధించాడు. ఇక, హర్షిత్ రాణా తొలి 3 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 44 రన్స్ ఇచ్చాడు. శ్రీలంక బ్యాటర్లు టీమిండియా బౌలర్లను చితక్కొట్టారు. తొలి 7 ఓవర్లలో ఏకంగా 90 రన్స్ బాదారు.

Just In

01

Kavitha: జాగృతితో పెట్టుకున్నోళ్లు.. ఎవరూ బాగుపడలేదు.. కవిత సంచలన కామెంట్స్!

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు.. 42 టేబుళ్ల పై 10 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు

The Face of The Faceless: 123 అవార్డులు పొంది, ఆస్కార్‌కు నామినేటైన సినిమా తెలుగులో.. రిలీజ్ ఎప్పుడంటే?

Tollywood: రాఘవేంద్రరావు – నిహారిక.. ఎందుకింత రచ్చ? అందులో ఏముందని?

Ram Gopal Varma: ‘శివ’ సైకిల్ చేజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌కు 35 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన వర్మ! ఆ పాప ఇప్పుడెలా ఉందంటే?