Kothagudem Rains ( image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు

Kothagudem Rains: ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల (Kothagudem Rains) వలన జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది. కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohit Raju) ఐపిఎస్ గారు సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. నదులు, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు.ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడద

ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడదు 

పశువులను కాయడానికి నదులు, వాగులు, వంకల పరిసర ప్రాంతాల దగ్గరకు వెళ్లకూడదని సూచించారు. సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించవలసిందిగా సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం

జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండే విధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు. ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

 Also Read:Mirai Movie: ‘మిరాయ్’కి ‘వైబ్’ యాడయింది.. ఇక కుర్రాళ్లకు పండగే! 

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కీలక సూచనలు 

హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. జిల్లాలో రోజు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున పట్టణంలోని లోతట్టు ప్రాంత ప్రజలు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సికింద్రాబాద్ రసూల్ పురాలోని ప్యాట్నీ నాలాను సందర్శించి వరద ఉధృతి, చేపట్టిన నాలా పనులను ఆమె పరిశీలించారు.

రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు 

సనగరంలోని లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలలో రెస్క్యూ టీమ్స్, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని వివరించారు. వర్షాలు భారీగా కురుస్తున్నందున ఇళ్లల్లో నీళ్లు రావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడితే వెంటనే కలెక్టరేట్ లోని హెల్ప్ లైన్ నెంబర్ 9063423979 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సిబ్బంది అప్రమత్తమై సమస్యలకు పరిష్కారం చూపుతారని కలెక్టర్ వివరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ తో పాటు సికింద్రాబాద్ రవెన్యూ డివిజనల్ అధికారి సాయిరాం, తహశీల్దార్ పాండు నాయక్ సంబంధిత శాఖల అధికారులు తదితరులున్నారు.

Also Read: Threat to Ajit Doval: కెనడా లేదా, అమెరికా రా.. అజిత్ ధోవల్‌కు ఖలిస్థానీ తీవ్రవాది పన్నున్ బహిరంగ వార్నింగ్

Just In

01

Brazil Couple: కొండ అంచున కారు ఆపి.. రొమాన్స్‌లో మునిగిన జంట.. ఇంతలోనే స్పాట్ డెడ్!

Web Series: ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే చమటలు పట్టాల్సిందే.. ఏం థ్రిల్ ఉంది..

Suhas Family: మరో బిడ్డకు జన్మనిచ్చిన సుహాస్ భార్య.. ఫ్యామిలీలో సంతోషం

Ind Vs Pak Final: ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, పాండ్యా ఆడడం లేదా?.. కోచ్ షాకింగ్ అప్‌డేట్

Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు