Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
Ponguleti Srinivas Reddy (image credit: swetcha reporter)
Telangana News

Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

Ponguleti Srinivas Reddy:  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆదేశించారు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 Also Read: Puri Sethupathi movie: పూరి, సేతుపతి సినిమా నుంచి మరో అప్డేట్.. టీజర్ లాంచ్ ఎక్కడంటే?

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిసిన ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలు, వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇరిగేషన్,రవాణా,విద్యుత్, హైడ్రా, జీహెచ్ఎంసీ,రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేసి జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలిా

తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలని సూచించారు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీ వరద వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా వస్తున్న వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.

 Also Read: Rain Updates: నార్సింగి-హిమాయత్‌సాగర్ మధ్య ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్

Just In

01

Suicide Case: title: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి బాత్రూమ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్!

Musi Rejuvenation Project: మూసీ ప్రక్షాళన పక్కా.. మార్చిలో పనులు స్టార్ట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?

Mana Doctor Babe: శ్రీ స్కంద ‘మన డాక్టర్ బాబే’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేశాయి.. ఎలా ఉందంటే?

KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్