Puri Sethupathi movie: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, టైటిల్ సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని మూవీ టీం తెలిపింది. అయితే అది ఎక్కడ అన్న విషయం చెప్పలేదు. తాజాగా దానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం. ఈ ఈవెంట్ చెన్నైలోని హొటల్ గ్రీన్ పార్క్ లో మధ్యాహ్నం ఒకటి నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇది చెనైలో జరుగుతున్నందున పూరీ ఫ్యాన్ కు మాత్రం కొంచెం నిరాశను కలిగించింది. ఈవెంట్ కు విజయ్ సేతుపతి అభిమానులు హాజరుకానున్నారు. టైటిల్ టీజర్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని కోసం రెపటివరకూ వేచి ఉండాల్సిందే. దీనిని చూసిన పూరీ జగన్నాధ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ ఫ్యాన్ కు ఈ సినిమాతో మంచి విజయం దొరుకుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన
తెలుగు సినిమా దిగ్గజం పూరీ జగన్నాథ్ మరోసారి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నాడు. ఈ సారి అతని దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. టాబు, సమ్యుక్త మేనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ అన్‌టైటిల్డ్ మూవీని, తాత్కాలికంగా ‘పూరీసేతుపతి’ అని పిలుస్తున్నారు. పలు లొకేషన్ లలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇది ఒక న్యూ-ఏజ్ సోషల్ డ్రామా ఉండనుందని సమాచారం. దీనిని ‘రా అండ్ రియల్’ సినిమాటిక్ జర్నీగా వర్ణించబడుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చర్మీ కౌర్ ప్రెజెంటేషన్‌లో జేబీ మోషన్ ఆర్ట్స్‌తో కలిసి రూపొందుతోంది. ఈ సినిమా ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథగా ఉంటుందని సమాచారం. పూరీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read also-Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!
తెలుగు సినిమా పరిశ్రమలో ‘పోకిరి’తో మాస్టర్ మైండ్‌గా పేరుపొందిన పూరీ జగన్నాథ్, ఒక మల్టీ-టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్‌రైటర్, ఒక్కోసారి యాక్టర్‌గా కూడా కనిపించే ఈయన, తన యూనిక్ స్టైల్‌తో పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు పొందారు. 2000లలో తెలుగు సినిమాను షేక్ చేసిన ఈయన, ఇప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తున్నారు. కన్నడలో పూనీత్ రాజ్‌కుమార్‌ను ‘అప్పు’ (2002)తో లాంచ్ చేశారు. యాక్టింగ్‌లో క్యామియోలు.. ‘బిజినెస్‌మ్యాన్’లో టాక్సీ డ్రైవర్, ‘టెంపర్’లో బైకర్, ‘గాడ్‌ఫాదర్’ (2022)లో గోవర్ధన్. ఫైట్ మాస్టర్స్‌తో (విజయన్, అలాన్ అమిన్) క్లోజ్ వర్కింగ్ ఫేమస్. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల అయ్యే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
வணக்கம் சென்னை மக்களே… 🙏
Get ready for the Grand Launch Event of #PuriSethupathi Title & Teaser tomorrow, 28th September 💥
From 1 PM onwards at Hotel GreenPark, Chennai ❤️🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥#JBNarayanRaoKondrolla
Releases in Tamil,… pic.twitter.com/m1J2HxxvYU
— Puri Connects (@PuriConnects) September 27, 2025