Telangana BJP
తెలంగాణ

Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఎవరికి వారుగా ఆ స్థానాన్ని గెలుచుకోవాలని ధీమాతో ఉన్నారు. ఇతర పార్టీల తీరు ఒకలా ఉంటే బీజేపీలో ఈ తీరు మరోలా ఉంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా అభ్యర్థిని తానేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోరులో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందుకేసింది. అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణిని ప్రకటించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఈ బైపోల్‌లో గెలవకుంటే పరువు పోతుందని హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఒకట్రెండు సమావేశాలు నిర్వహించడం తప్పితే.. పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపించడం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి మాత్రం తానే అభ్యర్థినంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారనేది చర్చనీయాశంగా మారింది.

Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

పార్టీ పెద్దలకు షాక్

మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీలో పలువురు ఆశావహులు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ తరుణంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడంతో పలువురు పార్టీ పెద్దలు అవాక్కయినట్లు తెలిసింది. అసలు ప్రకటనే రాకుండా అభ్యర్థినంటూ ఎలా ప్రచారం చేసుకుంటారనే అంశంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్‌కే పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ 25866 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. 54683 ఓట్లతో ఓటమి చవిచూశారు. మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయినా పార్టీ ఆయనకు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరైనా ఆశించవచ్చని, ఆయన ఆశించడం కూడా తప్పు కాదని, కానీ పార్టీ లైన్‌ను దాటి తానే అభ్యర్థి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Mirai Movie: ‘మిరాయ్’కి ‘వైబ్’ యాడయింది.. ఇక కుర్రాళ్లకు పండగే!

పార్టీ అగ్రనేతలే వెనకడుగు వేస్తుంటే..

వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపికలో రాష్ట్ర నాయకత్వం ఇంకా అయోమయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్థిని ఫైనల్ చేయాల్సింది హైకమాండ్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సైతం పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్ రెడ్డి లోక్‌సభ పరిధిలోకి వస్తుండటంతో ఏ నేత దీనిపై స్పందించే ధైర్యం చేయడంలేదు. పార్టీ అగ్రనేతలే మాట్లాడానికి వెనుకడుగు వేస్తున్నారు. అలాంటిది లంకల దీపక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పార్టీ వర్గాలు కొందరు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడంతో పార్టీ ఏమైనా సంకేతాలు ఇచ్చిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. లేదంటే, పార్టీ లైన్‌తో సంబంధలేకుండా ఆశావహులను డిమోరల్ చేయడంలో భాగంగా దీపక్ రెడ్డి ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి పార్టీ ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

New DGP: నిజమైన ‘స్వేచ్ఛ’ కథనం… తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి