TGSRTC: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో ఎగువన కురుస్తున్న జోరు వాన కారణంగా జంట జలాశయలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శుక్రవారమే జలాశయాల గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేయడంతో… హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నగరంలో ప్రధాన బస్ స్టాండ్ అయిన ఎంజీబీఎస్ లోనికి తీసుకెళ్లే రెండు బ్రిడ్జిలు మునిగిపోయాయి. ఫలితంగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.
ఎంజీబీఎస్ తాత్కాలికంగా మూసివేత
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ ప్రయాణికులను ఉద్దేశిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరిందని స్పష్టం చేశారు. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని స్పష్టం చేశారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల… pic.twitter.com/KEKxJSWll6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 27, 2025
ఆ మార్గాల్లో బస్సు సర్వీసులు
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
Also Read: KCR: నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం.. మీరు బాగా పనిచేయండి: కేసీఆర్
ఎవరూ రావొద్దని విజ్ఞప్తి
మూసీకి వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని.. ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు వి.సి. సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆర్టీసీ తరపున పోస్ట్ పెట్టారు.
#WATCH | हैदराबाद, तेलंगाना: मुसी नदी के उफान पर होने के कारण MGBS बस स्टैंड जलमग्न हुआ। अधिकारियों ने बस टर्मिनल बंद किया और लोगों की सहायता के लिए बचाव दल तैनात किए। pic.twitter.com/WI4AWKFDUG
— ANI_HindiNews (@AHindinews) September 27, 2025