GHMC Commissioner:: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త ప్లాన్
GHMC Commissioner( IMAGE CREDIT: TWITTER)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

GHMC Commissioner: గ్రేటర్ హైదరాగబాద్ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీని సరళీకృతం చేసే దిశగా జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్.వి. కర్ణన్(r.v. karnan) సరి కొత్త సంస్కరణలను తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉంటేనే కరెంటు, వాటర్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయాలని నిర్ణయించిన కమిషనర్ ఇపుడు అనుమతులు జారీ చేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం అడుగుతున్న వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్లపై దృష్టి సారించారు. ఈ సర్టిఫికెట్ల జారీ సాకుతో పైరవీలు, అవినీతి చోటుచేసుకోవటంతో పాటు నిర్మాణ అనుమతుల జారీ ప్రాసెస్ పెరిగి, సమయం కూడా వృథా అవుతున్నట్లు కమిషనర్ గుర్తించారు.

అవినీతి, పైరవీలకు చెక పెట్టేందుకు వీలుగా కమిషనర్ కర్ణన్

కొన్ని సందర్భాల్లో వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ సాకుతో టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు కమిషనర్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఫిజిబిలిటీ సర్టిఫికెట్ల జారీలో చోటుచేసుకుంటున్న అవినీతి, పైరవీలకు చెక పెట్టేందుకు వీలుగా కమిషనర్ కర్ణన్ నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ అవసరమన్న నిబంధనకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు సమాచారం. నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు వాటర్ ఫిజిబిలిట్ సర్టిఫికెట్ న జలమండలి నుంచి తీసుకుని టౌన్ ప్లానింగ్ విభాగానికి సమర్పించేందుకు సమయం ఎక్కువ పడుతుండటం, మధ్యవర్తులు జోక్యం చేసుకుని, అధికారులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం.

 Also Read: KTR: జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం: కేటీఆర్

జారీ చేసే సమయంలో సర్టిఫికెట్ అవసరం లేదు 

సేకరించిన కమిషనర్ వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ జలమండలితో ముడిపడి ఉన్న విషయం కావటంతో నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలో సర్టిఫికెట్ అవసరం లేదన్న అభిప్రాయానికొచ్చినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆయన సర్క్యులర్ జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ భవన నిర్మాణ అనుమతి తీసుకునే సమయంలో కాకుండా, భవనం నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో భవన యజమాని, ఆర్కిటెక్చర్ వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ జతపర్చాల్సి ఉంటుందన్న సరి కొత్త నిబంధనను ఆయన త్వరలోనే అమలు చేసేందుకు సిద్దమైట్లు సమాచారం.

కొత్త నిబంధనతో డీవియేషన్స్‌కు చెక్

ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకుంటున్న యజమానులు, బిల్డర్లలో అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జారీ చేసిన అనుమతులన్నింటికీ నేటికీ అక్యుపెన్సీ సర్టిఫికెట్లు తీసుకోకపోయినా, నిర్మాణం పూర్తయిన భవనాలకు అక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే కరెంటు, వాటర్ కనెక్షన్లు అడ్డదారిలో మంజూరవుతున్నాయి. వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను అనుమతుల జారీ సమయంలో కాకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత జారీ చేసే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో అడిగితే, కొంత వరకు నిర్మాణంలో డీవియేషన్స్ కు చెక్ పెట్టవచ్చునని జీహెచ్ఎంసీ కమిషనర్ భావిస్తున్నారు.

 Also Read: High Court: టీజీపీఎస్సీ హైకోర్టులో భారీ ఊరట.. నియామకాలు చేపట్టవచ్చని డివిజన్​ బెంచ్​!

జీహెచ్ఎంసీ సిద్దం

అక్యపెన్సీ సర్టిఫికెట్ కోసం బిల్డర్, యజమాని దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినానంతరం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో భవన నిర్మాణాన్ని పరిశీలించి, పది శాతం డీవియేషన్స్ మినహాయించి నిర్మాణం జరిగి ఉంటేనే అక్యుపెన్సీ జారీ చేస్తారని, అంతకన్నా ఎక్కువ డీవియేషన్స్ తో నిర్మాణం జరిగి ఉంటే అక్యుపెన్సీ సర్టిఫికెట్ దరఖాస్తు తిరస్కరించటంతో సదరు భవనానికి కరెంటు, వాటర్ కనెక్షన్ రాకుండా పకడ్బందీగా వాటర్ ఫిజిబిలిటి సర్టిఫికెట్ నిబంధనను అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతున్నట్లు తెలిసింది.

అది ఉంటేనే…

త్వరలోనే భవన నిర్మాణ అనుమతు కోసం దరఖాస్తు చేసుకునే యజమానులు, బిల్డర్లు అనుమతి తీసుకునే సమయంలో కాకుండా అక్యుపెన్సీ సర్టిఫికెట్ సమయంలో వాటర్ ఫిజిబిలిటీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన తర్వాత అక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉన్న భవనాలకు మాత్రమే వాటర్, కరెంటు కనెక్షన్లు మంజూరు చేయాలని త్వరలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జలమండలి, విద్యుత్ శాఖలకు లేఖలు రాయనున్నట్లు సమాచారం.

 Also Read: Seethakka: మన బతుకమ్మలను బ్రతికించుకుందాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు