KTR (imagecredit:twitter)
Politics

KTR: జీఎస్టీ పేరుతో రూ.15లక్షల కోట్లు దోచుకున్న కేంద్రం: కేటీఆర్

KTR: కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని.. ప్రజాద్రోహీ బీజేపీ పార్టీని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుందని ఆరోపించారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రభుత్వ సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమన్నారు. జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోడీ, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని ప్రభుత్వానికి సిగ్గుమాలినదని ధ్వజమెత్తారు. యూరియా(Urea) కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట(Surapet)లో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఈ దాష్టికాన్ని మేము వదిలిపెట్టమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని, రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’? పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని, ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు.

మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు..

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. “జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారని, ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయారన్నారు. మోడీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’

డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో..

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారని నిలదీశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా కేసీఆర్(KCR) తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. పదేళ్లలో మనం చేసిన పనులను ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయామన్నారు. డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)ల నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌(KCR)ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం

అభయహస్తం డిక్లరేషన్‌లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ(KTR)ర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ బృందం సభ్యులు కలిశారు. ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దాన్ని అమలుచేయడం లేదన్నారు. కేటీఆర్ గిగ్ వర్కర్స్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గిగ్ కార్మికుల సంక్షేమాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వారి భద్రత, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read: Nizamabad District: మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసం.. నిందితులు అరెస్ట్!

Just In

01

Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!

Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్?

FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

OG Review In Telugu: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ జెన్యూన్ రివ్యూ.. సినిమా హిట్టా? ఫట్టా?

OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?