Seethakka: తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతికి ప్రత్యక్ష నిలయాలుగా బతుకమ్మ వేడుకలు నిలుస్తాయని, అందుకు అందరూ మన బతుకమ్మను బ్రతికించుకుందాం అనే నినాదంతో వేడుకలను మరింత తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. సిడబ్ల్యుసి చైర్ పర్సన్ సుంకరనేని నాగవాణి ఆద్వర్యంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా మన ఇంటి బతుకమ్మలను బ్రతికించుకుందాం అనే నినాదంతో గోడ పత్రికలను విడుదల చేశారు.
Also Read: Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఆదివాసి అడవి బిడ్డలకు తీరని తిప్పలు
ఈ సందర్భంగా సీతక్క.. మాట్లాడుతూ..
ఆడపిల్లలకు తగిన గౌరవం ఇవ్వాలని, రోజు రోజుకు ఆడవారి పై అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయని, అన్ని రంగాలలో మహిళలు వారి ప్రతిభను చూపుతున్నా వారి పట్ల వివక్షత చూపడం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపులో ఉండగానే ఆడపిల్లల పట్ల వివక్షత మెుదలవుతుందని ప్రతి దశలో వారి పట్ల వివక్షత చూపుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో నేడు ఆడవారి పై జరుగుతున్న లైంగిక వేధింపులు ప్రతి ఒక్కరు వ్యతిరేకించి ఆడవారు ధైర్యంగా వారి వారి రంగాలలో రాణించడానికి కావలసిన మద్దతును అందించాలని పిలుపునిచ్చారు.
మన బతుకమ్మలను బ్రతికించుకుందాంఈ సందర్భంగా డాక్టర్ నాగవాణి గారు మాట్లాడుతూ…
గత 18 సంవత్సరాలుగా ఆడపిల్లలకు కావలసిన సహాయ సౌకర్యాలను అందించడం మాత్రమే కాకుండా మహిళలకు వారి సాదికారత కొరకు వివిద సంస్థల సహకారంతో అనేక వృత్తి నైపుణ్యాల పై శిక్షణ ను ఇప్పించి వారి ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరచడానికి సహాయం అందిస్తున్నామని అన్నారు. బతుకమ్మ ల సాక్షిగా మన ఇంట్లో ని ఆడపిల్లలను రక్షించుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read: OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?