CMRF Fraud ( image CREDIT: SWETCHA Reporter)
హైదరాబాద్

CMRF Fraud: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌ కేసు.. మరో ఇద్దరు అరెస్టు

CMRF Fraud: సీఎం రిలీఫ్​ ఫండ్ స్కాంలో (CMRF Fraud) జూబ్లీహిల్స్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. డీఐ సత్యనారాయణ (DI Satyanarayana) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించే విషయం తెలిసిందే. బీఆర్​ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇలా పలువురి పేర చెక్కులు మంజూరయ్యాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్​ రావు ఆఫీస్​ ఉద్యోగి జోగుల నరేశ్​ కుమార్​ ఈ చెక్కుల పంపిణీని పర్యవేక్షించేవాడు. చెక్కులు వచ్చినా లబ్దిదారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని తన వద్దనే పెట్టుకున్నాడు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నరేశ్ కుమార్ 230 చెక్కులను ఆఫీస్ నుంచి తస్కరించాడు.

 Also Read: Urea Shortage: యూరియా కష్టాలు ఎన్నటికీ తీరతాయి.. రైతులు రోడ్డెక్కినా పట్టించుకోని పాలకులు

రూ. 8.71 లక్షల రూపాయలు 

ఆ తరువాత లబ్దిదారులు పేరు, వయసు ఇతర వివరాలు సరిపోయిన వారితో జూబ్లీహిల్స్​ రోడ్డు నెంబర్ 5లోని స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ హైదరాబాద్ లో ఖాతాలు తెరిపించాడు. వాటిల్లో తాను కొట్టేసిన చెక్కులను జమ చేయించాడు.ఆ తరువాత నగదును విత్ డ్రా చేయించి ఖాతాలు సమకూర్చిన వారితో కలిసి పంచుకున్నాడు. ఇలా జోగుల నరేశ్​ కుమార్​ మొత్తం రూ.  8.71 లక్షల రూపాయలను కొల్లగొట్టినట్టు తెలియటంతో జూబ్లీహిల్స్​ పోలీసులు కేసులు నమోదు చేశారు. జోగుల నరేశ్​ కుమార్​ తోపాటు అతనికి సహకరించిన బాలగోని వెంకటేశ్​, కోరలపాటి వంశీ, పులిపాక ఓంకార్​ లను జూలై నెలలో అరెస్ట్ చేశారు.

డీఐ సత్యనారాయణ వారి కోసం గాలింపు

రెండు రోజుల క్రితం ఇదే కేసులో కరీంనగర్​ జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన పొట్ల రవి (46), జనగామ నాగరాజు (40), ధర్మారం రాజు (50), కాంపల్లి సంతోష్​ (35), చిట్యాల లక్ష్మి (65), ఆసంపెల్లి లక్ష్మిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులను గుర్తించినట్టు డీఐ సత్యనారాయణ చెప్పారు. ఇక, ఆదివారం ఇదే కేసులో నిందితులుగా ఉన్న పగడాల శ్రీనివాస రావు (23), యాస వెంకటేశ్వర్లు (50)ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నట్టు చెప్పిన డీఐ సత్యనారాయణ వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. నిందితులు స్వాహా చేసిన డబ్బును రికవరీ చేయటానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

Also Read: Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

14.50 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎక్సయిజ్ అధికారులు మరో 14.5‌‌0 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ ప్రవీణ్​ కుమార్, చేవెళ్ల ఎక్సయిజ్ పోలీసులతో కలిసి ఆదివారం వాహనాల తనిఖీ జరిపారు. ఈ క్రమంలో విదేశీ మద్యంతోపాటు మొత్తం 36‌‌0 బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులు వీటిని గోవా, హర్యానా, లక్నో నుంచి తీసుకు వచ్చినట్టుగా గుర్తించారు.

 Also Read: Modi announcement: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. సోమవారం నుంచే అమల్లోకి..

Just In

01

Illegal Cattle Transport: చర్ల వయా భద్రాచలం టు కురవి .. స్వేచ్ఛ కథనం సోషల్ మీడియాలో విస్తృత వైరల్

Car-Bike price cuts: అమల్లోకి జీఎస్టీ 2.O.. రేట్లు తగ్గిన బైకులు, కార్ల జాబితా ఇదే

Kantara Chapter 1 Trailer: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Urea Shortage: రైతులను వీడని యూరియా కష్టాలు.. ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఆందోళన

Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక