OG concert rain disruption: వరుణుడి ఎఫెక్టుతో ఓజీ కాన్సర్ట్ అంతంత మాత్రంగానే జరిగింది. ఈవెంట్ ప్రారంభించే ముందు థమన్ వానను కూడా లెక్క చేయం అని ధైర్యం ఇచ్చినా.. చివరికి ఎవరూ ఏం చేయలేక పోయారు. జోరున వాన పడుతున్నా అభిమానులు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కానీ కాన్సర్ట్ నిర్వహించడానికి మాత్రం అవకాశం లేకపోవడంతో తొందరగా పవన్ తో మాట్లాడించి ఈవెంట్ ముగించారు. కనీసం ట్రైలర్ అయినా వస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కూడా డిలే అయింది. పవన్ మాట్లాడిన కొన్ని మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అంతకుమందు ‘ఓజీ’ కన్సర్ట్ లో పవన్ ఎంట్రీ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా సినిమా మూడ్ లో కనిపించారు.‘ఓజీ’ స్టిల్ లో పవన్ ను చూసిన అభిమానులకు సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-Panchayat Elections: స్థానికంపై సర్కార్ ‘వ్యూహాత్మకం’.. జిల్లా కలెక్టర్లకు కీలక సూచన
సినిమా కోర్ స్టోరీ, ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల పర్యవసానం తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’ – Omi Bhau) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు – ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సి నట్టుగా ఉంటాయి.
Read also-Kavitha: కేసీఆర్ స్వగ్రామంలో కవిత కీలక వ్యాఖ్యలు
‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.