Kavitha-Vs-BRS
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kavitha: కేసీఆర్ స్వగ్రామంలో కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు!

అదే విషయం మాట్లాడితే కుటుంబం నుంచి విడదీశారు!
కుట్ర చేసి తల్లిని, పిల్లను విడదీశారు
చింతమడక నన్ను అక్కున చేర్చుకుంది
బతుకమ్మ సంబరాల వేడుకల్లో కల్వకుంట్ల కవిత ఆవేదన!
ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ మళ్ళీ సిద్దిపేటకు, చితమడకకు వస్తా!
పరోక్షంగా హరీష్ రావుపై ధ్వజమెత్తిన కవిత!

మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సారథి, చింతమడక గ్రామ ముద్దుబిడ్డ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించి, దేశ , రాష్ట్ర చరిత్రను మార్చారని కవిత కొనియాడారు. అయితే, అలాంటి వ్యక్తికి కొందరు మచ్చ తెచ్చారని, అదే విషయాన్ని తాను చెబితే కుట్రలు చేసి పార్టీకి, కుటుంబానికి దూరం చేశారని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె  సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పరోక్షంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆమె ప్రసంగించారు.

‘‘సిద్ధిపేట, చింతమడక ఎవరి జాగీరూ కాదు, ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ సిద్దిపేటకు, చింతమడకకు వస్తా’’ అని కవిత హెచ్చరించారు. 2004లో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేసి.. ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును మంత్రిని చేశారని పరోక్షంగా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి సిద్దిపేట , చింతమడకలలో ఆంక్షలు పెడుతున్నారని బహిరంగంగా కవిత ప్రకటించారు. కేసీఆర్‌కు మచ్చ తెస్తున్నారంటూ పార్టీలో మాట్లాడానని, అందుకే తనను కుట్రలు చేసి పార్టీకి,  తల్లిదండ్రులకు దూరంగా పంపారని కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలోనే తూటాలకు బయపడలేదని, ఆంక్షలకు భయపడేది లేదని పరోక్షంగా హరీష్ రావుపై కవిత ధ్వజమెత్తారు.

Read Also- Beauty movie success meet: ‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం.. ఎందుకంటే?

పెండ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళితేనే..!

పెళ్లి చేసుకొని ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్తేనే పుట్టింటి వారికి ఎంతో బాధ ఉంటుందని, అలాంటి బాధలో ఉన్నప్పుడు అమ్మగారి ఊరు ఆడబిడ్డలు,చింతమడక గ్రామానికి తనను పిలిచి అండగా నిలబడ్డారని చెప్పారు. ప్రశ్నించినందుకు తనను కుట్రలు చేసి పార్టీ నుండి చివరకు, తల్లిదండ్రుల నుండి తనను వీడదీశారని ఆవేదన చెందారు. దుఃఖంలో ఉన్న తనకు చింతమడత గ్రామం అండనిచ్చిందని అన్నారు.చింత మడక చరిత్ర సృష్టించిందని భవిష్యత్తులో మరోసారి భూకంపం పుట్టిస్తుందనీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Read Also- Telangana Anganwadi: అంగన్వాడీలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి.. 1వ తేదీన అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలి

అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

చింతమడక గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరిగాయి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. డీజే సౌండ్, ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గ్రామ ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?