Telangana Anganwadi: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలను అందించాలని, కనీస వేతనం అంగన్వాడీలకు రూ.26,000 లు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐటీయూసీ) యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్. ఝాన్సీరాణి, కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ యూనియన్ కార్యదర్శి మాలోత్ లక్ష్మి కోరారు. ఆదివారం కామేపల్లిలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్. ఝాన్సీ రాణి, కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు యూనియన్ కార్యదర్శి మాలోతు లక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10,00,00 లు అందించాలని తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
అంగన్వాడీ టీచర్లకుబిఎల్ వో డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో కానీ,ఆరోగ్య సమస్యలతో ఉద్యోగం కోల్పోయిన వారి కుటుంబంలో తక్షణమే ఉద్యోగం కల్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు నాణ్యమైన సెల్ ఫోన్ లను వెంటనే అందించాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు వి.ఆదిలక్ష్మి, వి.నాగ బసవమ్మ,జె.జానకి, వై.పద్మ, వై.అరుణ, సూర్యకళ, ఉష,జ్యోతి, ఝాన్సీ, కమల, భాగ్యమ్మ పాల్గొన్నారు.
Also Read: Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి