vedika ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Vedika: హీరోయిన్ బట్టల పై కామెంట్స్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? నటి వేదిక ఫైర్

Vedika: హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ బ్యూటీ సోషల్ మీడియా విమర్శకులపై, నెటిజన్లపై ఘాటుగా స్పందించారు. హీరోయిన్ అనగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారని, ఇప్పటికైనా ఈ తీరు మారాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, ఈ భామ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేదిక సోషల్ మీడియాలో హీరోయిన్లపై చేసే అసభ్యకరమైన కామెంట్స్ గురించి మండిపడ్డారు. ” కారణం లేకుండా క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తారు. కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే చాలు, వేలెత్తి చూపడానికి రెడీ అవుతారు ” అని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

Also Read: Thummala Nageswara Rao: రైతన్నలకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా.. మంత్రి కీలక వ్యాఖ్యలు

హీరోయిన్ల పై విమర్శలు కొత్తేమీ కాదు కానీ, గ్లామరస్ దుస్తులు ధరిస్తే వారి వ్యక్తిత్వాన్నే తప్పుబట్టడం ఆమెకు తీవ్ర బాధ కలిగించింది. ” హీరోయిన్ల దుస్తుల గురించి మాట్లాడే ఈ దుస్థితి మారాలి. నేను బికినీ వేసుకొని నటించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు నా విలువ తెలుసు. మారాల్సింది నేను కాదు, మీ ఆలోచనలు మారాలి. ” అంటూ వేదిక స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే వేదిక ఇలా మాట్లాడటంతో ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: Huzurabad Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో అందని వైద్యం.. ఫిజియోథెరపీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

వేదిక గురించి చెప్పాలంటే, మహారాష్ట్రకు చెందిన ఈ 37 ఏళ్ల బ్యూటీ ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్ విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

Also Read: Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. రెండు రోజుల్లో 35 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం