prabhas( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: ప్రభాస్‌కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్‌ అవ్వడానికి రీజన్ ఇదే..

Prabhas: డార్లింగ్ ప్రభాస్ సినీ ప్రయాణం నేటితో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన నటించిన మొట్టమొదటి సినిమా ‘ఈశ్వర్’ 2002లో సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా అడుగుపెట్టిన ప్రభాస్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘బాహుబలి’గా ఎదిగే అద్భుత ప్రయాణం ఇది. 23 ఏళ్ల సినీ జీవితంలో సుమారు 23 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్ కెరీర్‌ను ప్రధానంగా ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’ తర్వాత అని విభజించవచ్చు.

Read also-Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

స్టార్‌డమ్ దశ

2002లో ‘ఈశ్వర్’తో పరిచయమైనా, ‘వర్షం’ (2004) సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను, మంచి గుర్తింపును అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ (2005) సినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్, భారీ యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ వంటి విజయవంతమైన చిత్రాలు లవర్ బాయ్, ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (2013) ప్రభాస్‌కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందించింది. కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

పాన్ ఇండియా ఎరా

‘మిర్చి’ తర్వాత, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన భారీ చిత్రం ‘బాహుబలి’ కోసం ప్రభాస్ సుమారు ఐదేళ్లు కేటాయించారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి కూడా మరే ఇతర సినిమా చేయకుండా ఒకే ప్రాజెక్టుకు అంత సమయం ఇవ్వడం ఆయన అంకితభావానికి నిదర్శనం. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) భారతీయ సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమా హిందీలో నేరుగా విడుదలైన మొదటి సౌత్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు అపారమైన అభిమానులను సంపాదించి పెట్టింది. ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ (2017) ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు చేసి, భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి’ విజయం ప్రభాస్‌ను కేవలం తెలుగు హీరోగా కాకుండా, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తొలి పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఈ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి రూ.100 కోట్ల నుంచి రూ.2000 కోట్లకు చేరింది.

Read also-Bigg Boss Telugu: బిగ్ బాస్‌లో ఆసక్తిర టాస్క్.. కళ్యాణ్‌కు రాణులుగా రీతూ, దివ్య.. ప్రోమో మామూల్గా లేదుగా!

గ్లోబల్ రేంజ్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ (2019), ‘సలార్’ (2023), ‘కల్కి 2898 AD’, రాబోయే సినిమాలు ‘ది రాజాసాబ్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్నాయి. ‘సాహో’ తెలుగులో ఆశించిన విజయం సాధించకపోయినా, హిందీలో ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ప్రభాస్ క్రేజ్ ఖాన్ స్టార్స్ సినిమాలు కూడా నిలబడలేకపోతున్నాయి అని నిరూపించింది. ఈ విధంగా, ‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ కష్టపడే తత్వం, పట్టుదల, నిబద్ధత, సింప్లిసిటీ ఆయన్ని రెబల్ స్టార్ స్థాయి నుండి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా, పాన్ ఇండియా స్టార్‌గా మార్చాయి.

Just In

01

Delhi Blast Case: దిల్లీలో భారీ పేలుడు.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. రంగంలోకి ఎన్ఐఏ

Collector Hanumanth Rao: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా? లేదా? : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..

Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?

Sanitation Crisis: దుర్గంధంలో గ్రామ పంచాయతీలు.. ఆగిపోయిన పారిశుద్య పనులు