Bathukamma 2025: బతుకమ్మ సంబురాలు.. షెడ్యూల్ విడుదల!
Bathukamma 2025 (Image Source: Twitter)
Telangana News

Bathukamma 2025: రేపటి నుంచే బతుకమ్మ సంబురాలు.. ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. సీఎం కీలక ప్రకటన

Bathukamma 2025: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేప‌టి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ  ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక  అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని సీఎం కొనియాడారు.

ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆట పాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

బతుకమ్మ షెడ్యూల్ ఇదే.. 

21వ తేదీ ఆదివారం

•వేయి స్తంభాల గుడి, వరంగల్ – బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం)

• హైదరాబాద్ శివారులో మొక్క‌లు నాట‌డం (ఉదయం)

22వ తేదీ సోమవారం

•శిల్పరామం, హైదరాబాద్

•పిల్లలమర్రి, మహబూబ్‌నగర్

23వ తేదీ మంగళవారం

•బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ

24వ తేదీ బుధవారం

•కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి

•సిటీ సెంటర్, కరీంనగర్

25వ తేదీ గురువారం

•భద్రాచలం ఆలయం- కొత్త‌గూడెం, ఖమ్మం

•జోగులాంబ అలంపూర్, గద్వాల

•స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు)

26వ తేదీ శుక్రవారం

•అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్

•ఆదిలాబాద్, మెదక్

•నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం)

27వ తేదీ శనివారం

•మహిళల బైక్‌ ర్యాలీ – నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ –  (ఉదయం)

•ఐటి కారిడార్, హైదరాబాద్ – బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)

28వ తేదీ ఆదివారం

•ఎల్‌బి స్టేడియం, హైదరాబాద్ – గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)

29వ తేదీ సోమవారం

•పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ – ఉత్త‌మ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్ (SHG’s తో)

•RWA’s  (రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేష‌న్స్), Hyderabad Software Enterprises Association: (HYSEA) , హైదరాబాద్ & రంగారెడ్డి ప్రాంతం – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు

Also Read: Viral Video: కొరియన్ అమ్మాయిలతో.. పులిహోర కలిపిన దిల్లీ అబ్బాయి.. ఇంత కరువులో ఉన్నావేంట్రా!

30వ తేదీ మంగళవారం

•ట్యాంక్‌బండ్ – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, IKEBANA (ఇకెబానా – జ‌ప‌నీయుల‌)  ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3D మ్యాప్ లేజర్ షో

Just In

01

Pregnant Murder: కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతైన కూతుర్ని చంపేసిన తండ్రి

Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు

UPSC Topper: దేశ సేవే లక్ష్యం.. గూగుల్ ఉద్యోగం వదిలి IAS టాపర్ గా నిలిచిన యువకుడు

Apple India: బెంగళూరు ఆపిల్ ప్లాంట్‌లో మహిళలకే ప్రాధాన్యం.. దాదాపు 80 శాతం మంది వాళ్లే..!

Thanuja: ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ఆరంభం.. తనూజ ఎమోషనల్ పోస్ట్ వైరల్!