Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: కొరియన్ అమ్మాయిలతో.. పులిహోర కలిపిన దిల్లీ అబ్బాయి.. ఇంత కరువులో ఉన్నావేంట్రా!

Viral Video: దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన కొరియన్ యువతులతో స్థానిక వ్యక్తి సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశీ పర్యాటకుల పట్ల అతడు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పరువు తీసే విధంగా అతడు ప్రవర్తించాడని ఫైర్ అవుతున్నారు. ఇంతకీ దిల్లీ వాసి ఏం చేశాడు? కొరియన్ యువతులతో అతడు ఏం మాట్లాడాడు? ఇప్పుడు చూద్దాం.

వీడియోలో ఏముందంటే..
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. కొరియన్ అమ్మాయిలతో దిల్లీ యువకుడు మాట్లాడుతూ కనిపించాడు. ‘హలో ఎక్స్ క్యూజ్ మీ.. మై డ్రీమ్ పంచ్, పంచ్’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ మాటలతో గందరగోళానికి గురైన మహిళల్లో ఒకరు ‘నన్ను కొట్టాలనుకుంటున్నావా?’ అని ప్రశ్నించారు. వీడియో తీస్తున్న మరొకరు ‘ఫిస్ట్ బంప్’ (పిడికిలితో గుద్దుకొని హాయ్ చెప్పుకోవడం) అని స్పష్టం చేయడంతో పర్యాటకులు బలవంతంగా నవ్వుతూ అంగీకరించారు. తర్వాత ఆ వ్యక్తి మరో కోరిక వ్యక్తం చేస్తూ ‘హగ్’ అని అడిగాడు. వారిలో ఒకరు ఇందుకు అంగీకరించినప్పటికీ హగ్ ఇచ్చేటప్పుడు ఆమె చాలా అసౌకర్యంగా కనిపించింది.

చివర్లో ‘ఐ లవ్ యూ’ చెప్తూ..
కొరియన్ యువతులు వెళ్లిపోతున్న సమయంలో.. ‘యూ ఆర్ సో క్యూట్.. ఐ లవ్ యూ’ అంటూ దిల్లీ వాసి చేయి చాపాడు. పర్యాటకులు బలవంతంగా నవ్వుతూ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. ఈ వీడియోను ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేస్తూ.. “Indian local meets Korean girls” అని శీర్షిక పెట్టారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Jay 🔴 IRL India (@jaystreazy)

నెటిజన్లు విమర్శలు..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. దిల్లీ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి వల్ల భారతదేశం తలదించుకునే పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. ఒక వినియోగదారుడు స్పందిస్తూ.. ‘భారతదేశం తరఫున క్షమాపణలు’ అని రాశారు. ‘ఆ అమ్మాయి హగ్ చేస్తూ ఊపిరి బిగపట్టుకుంది’ అని మరొకరు పేర్కొన్నారు. ‘మొదట ఫిస్ట్ బంప్. తర్వాత హగ్.. ఆ తర్వాత ఐ లవ్ యూ? ఇది హాస్యం కాదు వేధింపే’ అని ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని మరికొందరు రాసుకొచ్చారు. మెుత్తంగా కొరియన్ మహిళలతో యువకుడు ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Also Read: Young Filmmakers Challenge: బతుకమ్మపై బంపర్ ఆఫర్.. రూ.3 లక్షలు గెలిచే ఛాన్స్.. 10 రోజులే గడువు!

భారత్‌లో విదేశీ పర్యాటకులు
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికా, బంగ్లాదేశ్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుంచి భారత్‌కు పర్యాటకులు వచ్చారు. 2024లో భారత్‌కు వచ్చిన విదేశీ పర్యాటకుల (Foreign Tourist Arrival – FTA) సంఖ్య 99.52 లక్షలుగా నమోదు అయ్యింది. వారితో పాటు శ్రీలంక, మలేషియా, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్ దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చారు.

Also Read: Bigg Boss 9: అంచనాలు తలకిందులు.. ఈ వీక్ కామనర్ ఔట్.. ఎవరో గెస్ కూడా చేయలేరు!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?