Young Filmmakers Challenge (Image Source: Twitter)
తెలంగాణ

Young Filmmakers Challenge: బతుకమ్మపై బంపర్ ఆఫర్.. రూ.3 లక్షలు గెలిచే ఛాన్స్.. 10 రోజులే గడువు!

Young Filmmakers Challenge: యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే మహత్తర కార్యానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆద్వర్యంలో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా “బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్” పోటీలను ప్రభుత్వం నిర్వహించ తలపెట్టింది. దీనికి సంబంధించిన బ్రోచర్, పోస్టర్‌లను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.

కళాకారులకు మంత్రి పిలుపు
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి, యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని మంచ్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన FDC చైర్మన్ దిల్ రాజును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేందుకు, యువ కళాకారుల ప్రతిభ వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీ సరైన వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు.

పోటీ వివరాలు
ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం (మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి, ఇందిర‌మ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త‌దిత‌రాలు), తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతి, పండుగ‌లు, క‌ళారూపాల‌పై షార్ట్ ఫిలిమ్స్‌, పాట‌ల పోటీలు ఉండనున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాల‌కు, పాట‌ల వ్య‌వ‌ధి 5 నిమిషాల‌కు మించి ఉండ‌కూడ‌దు.

పోటీలకు సంబంధించిన అర్హతలు:
1.ఈ పోటీలో పాల్గొనే వారందరూ 40 ఏళ్ళ లోపు వయసు కలిగి ఉండాలి.
2. 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
3. షార్ట్ ఫిల్మ్స్/ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన ‘థీమ్’ ల పైనే ఉండాలి.
4. మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
5. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినవై ఉండాలి

ప్రైజ్ మనీ ఎంతంటే?
“బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్” ప్రైజ్ మనీ వివరాలను సైతం ప్రభుత్వం ప్రకటించింది. మెుదటి విజేతకు రూ.3 ల‌క్షలు ప్రైజ్ మనీని అందించనున్నట్లు వెల్లడించింది. ద్వితీయ బ‌హుమ‌తి కింద రూ.2 ల‌క్ష‌లు, తృతీయ బ‌హుమ‌తి రూ.1 ల‌క్ష‌, కన్సోలేష‌న్ బ‌హుమ‌తి రూ. 20 వేలు (అయిదుగురికి) ఇవ్వ‌డంతో పాటు విజేత‌లంద‌రికీ ప్ర‌శంసా ప‌త్రం, జ్ఞాపిక ప్ర‌దానం చేస్తారు.

Also Read: Uttar Pradesh: ఎస్పీ తల్లికి అనారోగ్యం.. డాక్టర్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు.. యూపీలో రచ్చ రచ్చ!

విజేతలను ఎలా సెలక్ట్ చేస్తారంటే?
బతుకమ్మ ఛాలెంజ్ లో పోటీచేయదలిచిన వారు సెప్టెంబర్ 30 లోపల తమ ఎంట్రీలను నమోదు చేసుకోవాలి. నిర్దేశిత గడువులోగా వచ్చిన‌ ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపిక‌లు పూర్తి చేస్తుంది. ఎంట్రీల‌ను youngfilmmakerschallenge@gmail.com ద్వారా నమోదు చేసుకోవచ్చు. లేదంటే.. వాట్సాప్ నెంబర్ 8125834009కు పంపాలి.

Also Read: Kalvakuntla Kavitha: మళ్లీ ఓపెన్ అయిన కవిత.. కేసీఆర్, హరీశ్ రావుపై షాకింగ్ కామెంట్స్!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?