Chevening Scholarship: తెలంగాణ మెరిట్ విద్యార్ధులకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించే చెవెనింగ్ స్కాలర్ షిప్(Chevening Scholarship) ను అందించేందుకు యూకే(UK) సర్కార్ అంగీకరించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్(Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఎడ్యుకేషన్(Educatuon), టెక్నాలజీ(Tecnology) సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు
యూకే యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్(Hyderabad) నుంచే అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం కోరారు. ఇక తెలంగాణ(Telangana)లో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ ను బ్రిటీష్ హైకమిషనర్ కు సీఎం వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుక బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్(Musi Riverfront) అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరగా, బ్రిటీష్ హైకమిషనర్ సానుకూలం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని, రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సీపీఆర్వో మల్సూర్ లు ఉన్నారు.
చెవెనింగ్ స్కాలర్‌షిప్ అంటే..
చెవింగ్ స్కాలర్ షిప్ అనేది యునైటెడ్ కింగ్‌డమ్(UK) ప్రభుత్వం అందించే అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ఈ స్కాలర్‌షిప్ ను (విదేశాంగ, కామన్వెల్త్ & అభివృద్ధి కార్యాలయం) (FCDO) మరియు దాని భాగస్వామ్య సంస్థలు కలిసి నిర్వహిస్తాయి. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకోసం UK లో ఒక సంవత్సర Masters డిగ్రీ చదివే అవకాశం కల్పిస్తారు. దీనికోం భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను వీరు ఎంపిక చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా UK తో సంబంధాలు బలపరచడంకోసం, విద్యార్థులు UK లోని ప్రఖ్యాతగాంచిన పెద్ద పెద్ద యూనివర్శిటీల్లో చదివి తిరిగి తమ దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో మార్పు తేవడం దీని ప్రధాన లక్ష్యం.
Also Read: Pak Saudi Pact: సౌదీతో పాక్ రక్షణ ఒప్పందం.. భారత్‌తో యుద్ధం వస్తే కలిసి వస్తాయా?