Sai Durgha Tej at traffic summit
ఎంటర్‌టైన్మెంట్

Sai Durgha Tej: నేను తాగను.. నా ఫ్రెండ్స్ నన్ను పార్టీకి ఎందుకు పిలుస్తారంటే?

Sai Durgha Tej: నా తోటి హీరోలను సినిమాల్లో నటించేటప్పుడు కూడా హెల్మెట్స్ ధరించి స్టంట్స్ చేయమని చెబుతాను. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న సినిమా స్టంట్స్ చేసే స‌మ‌యంలోనూ హెల్మెట్ ధరించే క‌నిపిస్తారని అన్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ప్ర‌జ‌ల్లో రోడ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న కల్పించడానికి, రోడ్డు ప్రమాదాల‌ను అరిక‌ట్ట‌టానికి హైద‌రాబాద్ పోలీసులు గురువారం ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’ (Traffic Summit 2025)ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ‌కు ఆయన రూ.5 ల‌క్ష‌లు విరాళాన్ని అందించారు. అనంతరం సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ..

ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణమదే..

‘‘నేను ఈ కార్యక్రమానికి రావ‌టం వెనుక నా వ్య‌క్తిగ‌త కార‌ణం కూడా ఉంది. అది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. సెప్టెంబ‌ర్ 10, 2021లో నాకు యాక్సిడెంట్ జ‌రిగిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాల పాటు నేను కోమాలో ఉన్నాను. ఇదేదో నేను సానుభూతి కోసం చెప్ప‌టం లేదు. అంద‌రికీ తెలియాల‌ని మాత్రమే చెబుతున్నాను. ఆ రోజు నేను ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం.. నా త‌ల‌కు హెల్మెట్‌ను ధ‌రించ‌ట‌మే. అందువ‌ల్ల‌నే నేనీ రోజు ఇక్క‌డ ఇలా నిల‌బ‌డి ఉన్నాను. కాబ‌ట్టి బైక్ డ్రైవ్ చేసే ప్ర‌తీ ఒక్క‌రికీ హెల్మెట్ త‌ప్ప‌కుండా ధ‌రించమ‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి న‌డిపే ప్ర‌తీ ఒక్కరి ఫ్యామిలీ మెంబర్, భాగ‌స్వామి త‌ప్ప‌కుండా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Also Read- Deepika Padukone: ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే తొలగింపు వెనుక కారణాలు ఇవేనా?

అమ్మ ఒక మాట చెప్పింది

ఆ యాక్సిడెంట్ త‌ర్వాత నా వాయిస్ పోయింది.. నాకు చాలా విష‌యాలు గుర్తు లేవు.. మరిచిపోయాను. జీవితంపై ఆశ‌ను వ‌దులుకున్నాను. దయచేసి బైక్స్‌ను వేగంగా న‌డ‌ప‌కండి. అంద‌రికీ బ్యూటీఫుల్ లైఫ్ ఉందని గమనించండి. అంద‌రూ హాయిగా న‌వ్వుతూ బతకాలి. మీరు ప్రేమించేవాళ్లు ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాలంటే.. మీరు బైక్ ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి. అలాగే కారు న‌డిపేవాళ్లు కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా సీట్ బెల్ట్స్ ధ‌రించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ రూల్స్ పాటించ‌టం వ‌ల్ల మీకే కాదు.. మీతో, ఎదురుగా ఉండే తోటి ప్ర‌యాణీకుల‌కు కూడా మంచిదని గమనించండి. నేను బైక్ ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు బైక్‌పై నుంచి కింద‌ప‌డ‌టం మాత్ర‌మే నాకు గుర్తుంది. త‌ర్వాత హాస్పిట‌ల్‌లో క‌ళ్లు తెర‌వ‌టం మాత్ర‌మే గుర్తుంది. ఆ ప్ర‌మాదం త‌ర్వాత నాకు బైక్ రైడింగ్ అంటే భ‌యం వ‌చ్చేసింది. అప్పుడు మా అమ్మ నా చేతికి బైక్ తాళాల‌ను ఇచ్చి.. ఒక మాట చెప్పింది. ‘నా కొడుకు బైక్ రైడింగ్ అంటే భ‌య‌ప‌డాల‌ని, ఇకపై భ‌యంతోనే బ‌త‌కాల‌ని నేను కోరుకోవ‌టం లేదు. మన ఇంటి ముందున్న ఖాళీ ప్ర‌దేశంలో బైక్‌ను న‌డిపి ధైర్యం వ‌చ్చిన త‌ర్వాతే రోడ్డు పైకి వెళ్లు’ అని చెప్పింది. అమ్మ చెప్పిన‌ట్లు ఇప్పుడు నేను ప్ర‌తీ వారం ఇంటి ముందున్న ఖాళీ ప్ర‌దేశంలో మాత్రమే బైక్‌ న‌డుపుతున్నాను, అది కూడా హెల్మెట్ ధరించి మాత్రమే.

తాగుడు అలవాటు లేదు

ఇప్ప‌టికీ నేను పూర్తిగా రిక‌వ‌రీ కాలేదు. యాక్సిడెంట్ త‌ర్వాత నేను మాట్లాడ‌టాన్ని మ‌ర‌చిపోయాను. సెన్సిటివ్ బ్యాలెన్స్ పోయింది. పెన్ ఎలా ప‌ట్టుకోవాలో కూడా మ‌ర‌చిపోయాను. ఒక వాక్యాన్ని రాయ‌టం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు నేను ఉన్న స్టేజ్‌కు రావ‌టానికి చాలా టైమ్ ప‌ట్టింది. ఇంకా రోడ్‌పైకి డ్రైవ్‌కి వెళ్ల‌టానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. నాకు తాగుడు అలవాటు లేదు. సాధార‌ణంగా మా స్నేహితులు పార్టీ చేసుకున్న‌ప్పుడు నన్ను ఎందుకు పిలుస్తారంటే.. వారిని సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్ల‌టానికే. నేను మా మావ‌య్య‌ల‌ను (చిరంజీవి, నాగబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) వెన‌క ఎక్కించుకుని ఎప్పుడూ డ్రైవ్ చేయ‌లేదు. ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. క‌ళ్యాణ్‌ మామయ్యకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న బైక్ రైడింగ్ చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతుంటారు.

Also Read- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

పోలీస్ ఉంటే ఆ ధైర్య‌మే వేరు

ట్రాఫిక్ పోలీసులు మ‌నం గుర్తించ‌ని హీరోల‌ని తెలుసుకోండి. ఇంట్లో మ‌నం భ‌యం లేకుండా ఉంటున్నామంటే కార‌ణం అమ్మ‌, నాన్న‌, అక్క‌ వంటి కుటుంబ స‌భ్యులే. కానీ, మ‌నం బ‌య‌ట‌కు ధైర్యంగా వెళుతున్నామంటే కార‌ణం మాత్రం పోలీసులే. వారికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్లు మ‌న‌కు భ‌యం లేకుండా ఉండేలా ధైర్యాన్నిస్తారు. ఏ ప్రాబ్లం వ‌చ్చినా పోలీస్ ఉంటే ఆ ధైర్య‌మే వేరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ‌న‌కు తెలియ‌కుండానే వాళ్లు మ‌న జీవితాల్లో భాగ‌మైపోయారు. పోలీసులు సమయం మొత్తం మనకోసమే, మన క్షేమం కోసమే వెచ్చిస్తుంటారు. అలాంటి వాళ్లు బావుండాల‌ని మ‌నం ఎప్పుడూ కోరుకోవాలి. మా తాత‌ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన‌వారే.

ఏదైనా ప‌నిష్‌మెంట్ ఇవ్వండి

టి హ‌బ్ ద‌గ్గ‌ర బైక్ రేసింగ్స్ జ‌రుగుతాయ‌ని విన్నాను. నిజానికి నేను అక్క‌డ‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటాను కానీ.. నేనెప్పుడూ వాటిని చూడలేదు. నేను బైక్‌ను రేసింగ్స్‌కు వెళ్లేంత వేగంగా న‌డ‌ప‌ను. ఎందుకంటే, ఇంట్లో అమ్మ‌కు స‌మాధానం చెప్పాలి.. అలాగే త‌మ్ముడున్నాడు వాడికి స‌మాధానం చెప్పాలి. నేను అందరికీ చెప్పాలనుకున్న విషయం ఒక‌టే. మన జీవితానికి మ‌న‌మే బాధ్యులం.. ఎవ‌రూ బాధ్య‌త వ‌హించ‌రు. త‌ప్పు చేస్తే అంతా మ‌న‌ల్నే తిడ‌తారు. ఈ సందర్భంగా పోలీసుల‌ను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే.. హెల్మెట్ లేకుండా బైక్ న‌డిపేవారిని, తాగి బండి న‌డిపేవారిని ప‌ట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి, ఫైన్ వేసి వ‌దిలేస్తారు. కానీ అలా కాకుండా ఇంకా ఏదైనా బెట‌ర్‌గా చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. పిల్లాడు హోంవ‌ర్క్ చేయ‌క‌పోతే టీచ‌ర్ కొడ‌తాడ‌నే భ‌యం ఉంటుంది. అలాగే, హెల్మెట్ ధ‌రించ‌ని వాళ్ల‌కి, తాగి బండి న‌డిపేవాళ్ల‌కి ఏదైనా ప‌నిష్‌మెంట్ ఇస్తే బావుంటుంది. అంది ఎలా ఉంటే బాగుంటుందో పోలీసులు ఆలోచించాలి. అలా చేస్తే జీవితాల‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుందనేదే నా ఆలోచన. ఇది కేవలం నా రిక్వెస్ట్ మాత్ర‌మే’’ అని సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు