Kalki Deepika Padukone
ఎంటర్‌టైన్మెంట్

Deepika Padukone: ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే తొలగింపు వెనుక కారణాలు ఇవేనా?

Deepika Padukone: దీపికా పదుకొనేకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆమె కోరికల చిట్టా చూసి, దర్శకనిర్మాతలు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవ సందీప్ వంగాతో ‘స్పిరిట్’ (Spirit) విషయంతో పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన నటించేందుకు దీపికాను తీసుకోవాలని సందీప్ ప్రయత్నిస్తే.. ఆమె పెట్టిన కండీషన్స్‌ను అంగీకరించలేదని, ఈ సినిమా స్టోరీని రివీల్ చేసే ప్రయత్నం చేసింది. దీనిపై సందీప్ ఫైర్ అయ్యాడు. బాలీవుడ్ అంతా భగ్గుమంది. ఎవరు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, సందీప్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సినిమా విషయంలో అలా ఉంటే, ఇప్పుడామె తెలుగులో నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం విషయంలో కూడా పెద్ద ఝలక్‌ని చవిచూడాల్సి వచ్చింది.

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి అవుట్

బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విజయం తర్వాత, దాని సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. గురువారం చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొనే‌కు సరిపడా పాత్ర లేదని, అందుకే ఆమె రెండో పార్ట్‌లో భాగం కావడం లేదనేలా అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పైకి వారు ఇది చెప్పినా, అసలు విషయం వేరే ఉందనేలా సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. దీని వెనుక ప్రధానంగా ఆమె పెట్టిన కొన్ని కఠినమైన షరతులే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Mahavatar Narsimha OTT: ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

25 శాతం రెమ్యూనరేషన్ పెంచాల్సిందే..

‘కల్కి’ మొదటి భాగం కోసం దీపికా దాదాపు రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. అయితే, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, సీక్వెల్ కోసం ఆమె తన పారితోషికాన్ని 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె రూ. 25 నుంచి రూ. 30 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తుంది. సినిమాలో ప్రధాన పాత్రధారి ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులు మొదటి భాగం సమయంలో ఒప్పందం చేసుకున్న రెమ్యూనరేషన్‌కే సీక్వెల్‌లో నటించడానికి ఓకే చెబితే, దీపికా మాత్రం తన డిమాండ్‌పై వెనక్కి తగ్గలేదట. రెమ్యూనరేషన్ అంశంతో పాటు, దీపికా విధించిన ఇతర షరతులు కూడా నిర్మాతలకు భారంగా మారాయని అంటున్నారు. షూటింగ్‌కు ఆమె రోజుకు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తానని కండీషన్ పెట్టారట. ఎక్కువ గంటలు పనిచేయడానికి సెట్‌లోనే లగ్జరీ వ్యాన్ ఏర్పాటు చేస్తామని నిర్మాతలు చెప్పినా, ఆమె తన నిర్ణయం మార్చుకోలేదని సమాచారం.

Also Read- Ram Charan: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా.. గ్లోబల్ స్టార్!

తన సభ్యుల ఖర్చులన్నీ భరించాల్సిందే..

అంతేకాకుండా, దీపికా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆమెతో పాటు 25 మంది టీమ్ సభ్యులు కూడా వస్తారని, వారందరికీ ఫైవ్ స్టార్ హోటల్ వసతి, భోజన ఖర్చులను కూడా నిర్మాతలు భరించాలని ఆమె కోరినట్లు టాక్. ఈ భారీ డిమాండ్లు, షరతుల కారణంగానే మేకర్స్ ఆమెను సీక్వెల్ నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో ఎంత నిజం ఉందనేది అటు దీపికాకు, ఆమెను ఈ సినిమా నుంచి తొలగించిన మేకర్స్‌కే తెలియాలి. చూద్దాం.. ఈ విషయం ఎంత వరకు వెళుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు