Mahavatar Narsimha OTT
ఎంటర్‌టైన్మెంట్

Mahavatar Narsimha OTT: ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

Mahavatar Narsimha OTT: భారతీయ యానిమేషన్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకు పోటీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో.. హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర సునామీని సృష్టించింది. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా ‘ఛావా’ వంటి సక్సెస్ ఫుల్ చిత్ర రికార్డులను బ్రేక్ చేసిందంటే.. ఈ సినిమా సాధించిన విజయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీకి సంబంధించి, కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి తప్పితే.. అసలు ఎప్పుడొస్తుందనేది క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే..

Also Read- Vrusshabha Teaser: కింగ్‌గా మోహన్ లాల్ నటించిన ‘వృషభ’ టీజర్ ఎలా ఉందంటే..?

నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్

ఈ సినిమా ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలచేశారు. నిజంగా ఇది సర్‌ప్రైజ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇంకా ఈ థియేటర్లలో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు మేకర్స్ వాయిదా వేశారు. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘హరి హర వీరమల్లు’ ఓటీటీలోకి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. సడెన్‌గా వచ్చిన ఈ వార్తతో యానిమేషన్ ప్రియులు, పౌరాణిక కథలను ఇష్టపడే ప్రేక్షకులు, ముఖ్యంగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్న వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు

ఈ చిత్రం ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది. హిరణ్యకశిపుడు, అతని భక్తుడైన కుమారుడు ప్రహ్లాదుడు కథను అద్భుతమైన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా నరసింహ స్వామి అవతార దృశ్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా విజయం భారతీయ యానిమేషన్ చిత్రాలకు కొత్త దారి చూపింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇది భారతీయ సినిమాకు, ముఖ్యంగా యానిమేషన్ పరిశ్రమకు ఒక గొప్ప విజయం అని చెప్పవచ్చు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత

Gold Rate Today: గోల్డ్ లవర్స్ కి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

School Controversy: పండుగ రోజు స్కూల్ లో పిల్లలకు బలవంతపు పాఠాలు.. ఎక్కడంటే..?

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్