OG Movie
ఎంటర్‌టైన్మెంట్

OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG Trailer Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ‘గ్యాంగ్ స్టర్’ కథాంశంతో తెరకెక్కుతున్న పవన్ కళ్యాన్ తాజా చిత్రం ‘ఓజీ’ (OG) నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 21న ఉదయం 10:08 ని.లకు ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ పాత్ర పేరును ‘ఓజాస్ గంభీర’గా ఇందులో చూపించబోతున్నారు. దీనికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారనేది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌లు తెలియజేశాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారని, ఆయన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నట్లుగానే, విడుదలవుతున్న ప్రతి పోస్టర్ సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.

Also Read- Daksha: ‘దక్ష’తో హ్యాట్రిక్.. మంచు లక్ష్మి కాన్ఫిడెంట్ చూశారా!

ఫ్యాన్స్ మధ్య వార్

ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే, ఓజీ పేరు లేకుండా పోస్ట్‌లు పడటం లేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీ సేల్స్ విషయంలో మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అనేలా వారి అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్ (NTR) అభిమానులే ఎక్కువగా ఉన్నారు. వారి పోస్ట్‌లకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. మావాడు సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో.. మీరిలా రెచ్చిపోతున్నారంటూ గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారు. మొత్తంగా అయితే ఇలాంటి వార్స్‌తోనే.. సినిమాకు మంచి ప్రచారం వస్తోంది. అసలీ సినిమాకు ఆ హీరో, ఈ హీరో అనేం లేదు.. అందరూ ఎదురు చూస్తున్నారనే దానికి ఉదాహరణగా చెప్పాలంటే, ఇటీవల విడుదలైన సినిమాల హీరోలు.. వాళ్ల సినిమాలతో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేయడమే. అలా ఉంది ‘ఓజీ’ పరిస్థితి.

Also Read- Junior OTT: ‘జూనియర్’ ఓటీటీలోకి వస్తోంది.. శ్రీలీల ఫ్యాన్స్‌కు ‘పండగే’!

సెన్సార్ పూర్తి, విడుదలకు రెడీ

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యుబైఏ సర్టిపికేట్ పొందిన ఈ సినిమా.. విడుదలకు అన్ని విధాలుగా సంసిద్ధమైంది. ఏపీలో ఈ సినిమాకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుతో పాటు, బెనిఫిట్ షో‌కు అనుమతి ఇస్తూ.. ఆల్రెడీ జీవో కూడా విడుదలైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ‘సాహో’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో మెప్పించిన సుజీత్, ఈసారి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎలాంటి సంచలనాలను, రికార్డులను పెట్టబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు