Vrusshabha
ఎంటర్‌టైన్మెంట్

Vrusshabha Teaser: కింగ్‌గా మోహన్ లాల్ నటించిన ‘వృషభ’ టీజర్ ఎలా ఉందంటే..?

Vrusshabha Teaser: కంప్లీట్ యాక్టర్, మెగాస్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal) న‌టిస్తోన్న భారీ చిత్రం ‘వృషభ’ (Vrusshabha). రాగిణి ద్వివేది (Ragini Dwivedi), సమర్జిత్ లంకేష్ (Samarjit Lankesh) ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమాలో కింగ్‌గా మోహన్ లాల్ కనిపించనున్నారు. కింగ్‌ కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మాతలు. రచయిత, ద‌ర్శకుడైన నంద కిషోర్ (Nanda Kishore) రూపొందిస్తోన్న ఈ భారీ మూవీలో మోహన్ లాల్‌ సరికొత్తగా కనిపించి, ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘బాహుబలి’ తరహాలో గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. వెండితెరపై మరో అధ్భుతాన్ని ఆవిష్కరించిన ఫీల్‌ని టీజర్‌తో ఇచ్చేశారు మేకర్స్.

Also Read- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టీజర్ ఎలా ఉందంటే..

టీజర్‌ని గమనిస్తే.. వృషభ’ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. మహారాజుగా మోహన్ లాల్ ఎంట్రీ అద్భుతం అనేలా ఉంది. ఈ టీజర్‌తో మూవీ మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఆంటోనీ సామ్సన్ విజువల్స్, కె.ఎం. ప్రకాష్ ఎడిటింగ్, సామ్ సిఎస్ మ్యూజిక్, అకాడమీ అవార్డు గ్రహీత రసుల్ పూకుట్టి సాండ్ డిజైనింగ్ ఇలా అందరూ టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. వారి పనితనం ఈ టీజర్‌లో కనిపిస్తోంది. పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వా, నిఖిల్ కొరియోగ్రఫీ చేసిన అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మొత్తంగా అయితే.. ఈ టీజర్‌తో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేచి చూసేలా చేయగలిగారు మేకర్స్.

Also Read- Viral Video: గరిట ఎందుకు దండగ.. జేసీబీ ఉండగా.. పాపం తినేవారి పరిస్థితేంటో!

సినిమాగా మాత్రమే చూడటం లేదు

టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలలో ఒకరైన ఏక్తా కపూర్ మాట్లాడుతూ.. బాలాజీలో మేము ఎప్పుడూ ప‌వ‌ర్‌ఫుల్ కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ‘వృషభ’ మా అందరికీ ఎంతో నచ్చిన, మమ్మల్ని ఎంతగానో ఇన్‌స్పైర్‌ చేసిన ప్రాజెక్ట్. దీనిని మేము కేవలం సినిమాగా మాత్రమే చూడటం లేదు. ఎమోషన్స్, రిలేషన్స్, రివేంజ్, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం వంటి అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ మూవీతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్షకులకు ఇచ్చేందుకు మేం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. ‘వృషభ’ కేవలం సినిమా కాదు. ఎవ్వరం అలా చూడటం లేదు. ఇది మాకు మర్చిపోలేని ఓ స్ట్రాంగ్ ఎమోషన్. లెజెండరీ నటుడు మోహన్ లాల్‌తో కలిసి పనిచేయడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆయన ఉండే ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా ఉంటుంది. కొడుకు పాత్రలో సమర్జిత్ కూడా చాలా అద్భుతమైన పాత్రను చేశారు. ‘వృషభ’ అనేది తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే శక్తివంతమైన కథ. అందరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. మలయాళం, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషలలో కూడా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. రాబోయే దీపావళికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు