Alampur Jogulamba Temple ( image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Alampur Jogulamba Temple: అలంపూర్ ఆలయాల్లో ఆధిపత్యం.. శక్తి పీఠంని సైతం వదలని రాజకీయం

Alampur Jogulamba Temple: రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగా, దేశంలో ఐదవ శక్తిపీఠంగా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి.ఈ ఆలయాలలో రాజకీయాలు ప్రవేశించడంతో ఆలయ కార్యకలాపాల నిర్వహణ గందరగోళంగా మారి ఆలయ ప్రతిష్టతలు దిగజారుస్తున్నారు. ఎంతో పవిత్రమైన ఆలయంలో నిష్టతో,భక్తి భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి ఆలయంలో పూజారుల ఆధిపత్యం, రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువవడంతో ఆలయ అభివృద్ధి కుంటుపడి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 Also Read: TGPSC: గ్రూప్ 1పై కీలక నిర్ణయం.. సింగిల్ బెంచ్ తీర్పును విజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ

ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, ఆలయ కమిటీ

ఆలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కావడం ఆలయ పాలకమండలి అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు కావడంతో ప్రతి వ్యవహారంలో తమదే పై చేయిగా వ్యవహరించాలని ఇరు వర్గాలు పట్టుబడుతున్నంతో జోగులాంబ సాక్షిగా రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆలయ వ్యవహారాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని దాతల నుంచి ఆరోపణలు రాగా, ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాలలో ప్రధాన పూజారి తలదూర్చడం వివాదాస్పదమైంది.

అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీ సోదరుని కూతురు వివాహం పక్క రాష్ట్రంలో జరగగాముగ్గురు పూజరులు వెళ్లడం వివాదాస్పదం కావడంతో వారిని సస్పెండ్ చేసి, ఆలయ ఈవోను జమ్మిచేడు జములమ్మ ఆలయానికి బదిలీ చేశారు. ఇలా వరుసగా సంఘటనలు చోటు చేసుకుంటున్నా,తాజాగా దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు సమీపిస్తున్న వేళ మరోసారి ఆలయ వ్యవహారాల్లో పాలకమండలి, ఎమ్మెల్యే వేరువేరుగా వాల్ పోస్టర్లను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఈనెల 10న శరన్నవరాత్రుల వాల్ పోస్టర్ ను ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే విజయుడు విడుదల చేశారని, వేరే కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఉండడంతో హాజరు కాలేకపోయారని జోగులాంబ ఆలయ ఈవో దీప్తి అంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే అభయంతోనే

బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి ఆలయాలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆశీస్సులతో నూతన ఆలయ పాలక మండలి ఏర్పడింది. ఎంతో విశిష్టత కలిగిన ఆలయంలో పూజారులు నిత్యం పూజ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. ఆలయ వ్యవహారాలలో అంతా తాను సూచించినట్లే జరిగేలా వ్యవహరిస్తూ,ఏదైనా సమస్య తలెత్తినప్పుడు రాజకీయ నాయకులను ఆశ్రయించడం, తమ వర్గం వారే పాలకమండలి ఉండడంతో మరో రాజకీయ వర్గానికి సంబంధించిన వారు అనే కోణంలో కొందరి పూజారులపై అజమాయిషీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏమైనా జరుగుతే అంతా ఆయనే చూసుకుంటారులే అనే అభయంతో రాజకీయ నాయకులు ఆధిపత్య ధోరణి చెలాయిస్తున్నారనే భావన భక్తుల్లో వ్యక్తం అవుతుంది. ఇతర విషయాలలో మీ రాజకీయాలు చేసుకోండి కానీ పవిత్రమైన శక్తిపీఠంలో రాజకీయాలకు తావివ్వ వద్దని భక్తులు సూచిస్తున్నారు.

పూజారులపై ప్రభావం

జోగులాంబ,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో 11 మంది పూజారులు ఉండగా ముగ్గురు సస్పెండ్ కావడంతో..మిగిలిన పూజారులకు పని ఒత్తిడి, సమయాభావంతో ఆలయాల్లో జరిగే పూజా విధానాల్లో కష్టాలు ఏర్పడుతున్నాయని పూజారులు భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. అలాగే వీఐపీల తాకిడి సైతం అధికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమాల నిర్వహణ సక్రమంగా సవ్యంగా జరిగేందుకు తాత్కాలికంగా మరో నలుగురుని తీసుకోనున్నట్లు ఈవో తెలిపారు.

 Also Read: Most Expensive Cruise: ప్రపంచంలోనే లగ్జరీ క్రూయిజ్.. ఒక్కో టికెట్ రూ.7 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు