No handshake: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య రెండు రోజులక్రితం జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న పరిణామాలను పాక్ ఆటగాళ్లు, ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ‘హ్యాండ్‌షేక్’ (No handshake) ఇవ్వకపోవడంపై తీవ్రంగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్ గెలుపు తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా వెళ్లిపోవడం, భారత ఆటగాళ్లు మొత్తం ముఖం చాటేయడంపై పాకిస్థాన్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో (PCB) పాటు, కొంతమంది పాక్ ఆటగాళ్లు ఈ వ్యవహారంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, చూస్తూనే ఉన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసఫ్ మాత్రం అందరికంటే ఎక్కువ ఘాటుగా ఈ వ్యవహారంపై స్పందించాడు. ఇటీవల ఒక టీవీ ఛానల్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదంపై జరిగిన చర్చా కార్యక్రమంలో యూసఫ్ మాట్లాడుతూ, సూర్యకుమార్‌ను ‘పంది’ అని సంభోదించాడు. ఒక అంతర్జాతీయ ఆటగాడి గురించి మాట్లాడుతున్నామన్న స్పృహ లేకుండా అమర్యాదపూర్వకంగా మాట్లాడాడు.
Read Also- Kerala Crime: బాలుడిపై 14 మంది అత్యాచారం.. నిందితుల్లో పొలిటిషియన్, ప్రభుత్వ ఉద్యోగులు
యూసఫ్ వ్యాఖ్యలు విని యాంకర్లు కూడా షాక్‌కు గురయ్యారు. చర్చలో పాల్గొన్న ఇతరులు కూడా నోరెళ్లబెట్టారు. ఒక యాంకరైతే యూసఫ్ వ్యాఖ్యలను సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ యూసఫ్ తన దూషణలను కొనసాగించాడు. సామా టీవీ చర్చలో మాట్లాడుతూ యూసఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారతదేశం ఇంకా సినిమా ప్రపంచం నుంచి బయటపడలేకపోతోంది. తప్పుడు మార్గాల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తోంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ద్వారా పాకిస్థాన్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇది చాలా అగౌరవం’’ అని అతడు వ్యాఖ్యానించాడు. కాగా, సూర్యకుమార్‌ను అనవసరంగా, వ్యక్తిగతంగా దుర్భాషలాడడం పట్ల పాక్ క్రికెట్ అభిమానుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Pak Terrorist: పాక్ బట్టలిప్పి.. నడిరోడ్డున నిలబెట్టిన ఉగ్రవాది.. వీడియో వైరల్
కాగా, మహ్మద్ యూసఫ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 17,000 పరుగులు సాధించాడు. 1998 నుంచి 2010 వరకు 288 వన్డేలు, 90 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. పాకిస్థాన్‌కు చెందిన గౌరవప్రదమైన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అలాంటి ఆటగాడు దిగజారి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. యూసుఫ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సూర్యకుమార్ యాదవ్‌పై దురుసు వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వ్యక్తిగతంగా దూషించడం ఏమాత్రం సబబుకాదని అంటున్నారు.
కాగా, ‘నో హ్యాండ్‌షేక్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలికి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ లేకపోవడంపై మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుంచి ఆయనను తొలగించాలని, లేదంటే టోర్నమెంట్‌లో భాగంగా యూఏఈతో జరగనున్న తదుపరి మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అయితే, పాకిస్థాన్ డిమాండ్‌ను ఐసీసీ తోసిపుచ్చింది. ఆండీ పైక్రాఫ్ట్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని పాక్ ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు ఐసీసీ నో చెప్పింది.
A low level rhetoric from Yousuf Yohana (converted) on a national TV program.
He called India captain Suryakumar Yadav as "Suar" (pig).
Shameless behaviour. And they demand respect, preach morality. pic.twitter.com/yhWhnwaYYq
— Slogger (@kirikraja) September 16, 2025