Kerala Crime: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలుడిపై ఏకంగా 14 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో రాజకీయ నాయకుడితో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫుట్ బాల్ కోచ్ ఉండటం అందరినీ షాక్ గురిచేస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ కేసు గురించి జిల్లా పోలీసు అధికారి విజయ భరత్ రెడ్డి (Vijaya Bharat Reddy) మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ’10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి రెండు సంవత్సరాల క్రితం ఓ గే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అనుమానం ఉంది. గత రెండు సంవత్సరాల్లో కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం జిల్లాల్లో 14 మంది అతనిపై లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది’ అని అన్నారు.
Also Read: Dussehra 2025: రాంచీలో అద్భుతం.. తిరుమల థీమ్‌తో దుర్గా దేవీ మండపం.. భక్తులకు గూస్ బంప్స్ పక్కా!
తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
బాలుడి ఇంట్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు బాలుడి తల్లి ఫిర్యాదుతో వెలుగు చూసిందని పేర్కొన్నారు. ఆమె ఇంటికి రాగానే ఒక వ్యక్తి పారిపోతుండటాన్ని గమనించి.. కుమారుడ్ని ప్రశ్నించింది. అప్పుడు బాలుడు నిజం చెప్పడంతో ఆమె వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Pak Terrorist: పాక్ బట్టలిప్పి.. నడిరోడ్డున నిలబెట్టిన ఉగ్రవాది.. వీడియో వైరల్
రంగంలోకి సిట్
బాలుడి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టం (2012) కింద నిందితులపై 14 వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను దర్యాప్తు చేయడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. కాసరగోడ్‌లో జరిగిన ఎనిమిది కేసులను SIT విచారించనుండగా.. మిగతా ఆరు కేసులను కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు బదిలీ చేశారు. 25 నుండి 51 సంవత్సరాల వయస్సు గల 14 మంది నిందితులు.. ఈ కేసులో ఉన్నారు. వీరిలో ఒకరు రైల్వే ఉద్యోగి అని పోలీసులు ధృవీకరించారు. అదే సమయంలో గే యాప్‌లో వయస్సు ధ్రువీకరణ, స్వీయ సమాచారం (సెల్ఫ్ రిపోర్టింగ్) వంటి సదుపాయాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.