Dornakal Politics (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Dornakal Politics: డోర్నకల్‌లో రగులుతున్న రాజకీయం.. స్ధానిక పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు

Dornakal Politics: మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గస్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్(Ramachandranayak) వర్సెస్ మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavati Rathod) మధ్యనే డోర్నకల్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇటీవలనే డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ తన రెండు మోకాళ్ళకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని తన సొంత గ్రామం ఉగ్గంపల్లి లోనే ఉంటున్నారు. చిన్నచిన్న కార్యక్రమాలకు హాజరవుతూనే ప్రభుత్వంపై ఎక్కు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా చోటు దక్కించుకొని అదే బెర్త్తో మంత్రి పదవిని సైతం దక్కించుకొని ఔరా అనిపించారు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా అప్పట్లో గిరిజన సామాజిక వర్గ మహిళలకు ఇవ్వడం కూడా సవబేనని అనిపించుకున్నారు.

కనుమరుగు కోసం కుట్రలు

డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్(Congress) కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు కాంగ్రెస్ తరపున నిలబడిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అందులో ఎక్కువసార్లు గెలుపొందిన వారిలో మాజీ మంత్రి రెడ్యా నాయక్(Redya Nayak) స్థానం సంపాదించుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ కాదని ఇచ్చిన పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ అనారోగ్య కారణాల నేపథ్యంలో ఇంటికే పరిమితం అయ్యారు. అతి ముఖ్యమైన కార్యక్రమాలు మినహాయిస్తే బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయం తనకు అనుకూలమని భావించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్ నియోజకవర్గం పై పట్టు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే అడపాదడపా అక్కడి ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను ఎక్కు పెడుతున్నారు. మళ్లీ 2029 ఎన్నికల్లో డోర్నకల్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని విశేషంగా కృషి చేస్తున్నారు.

Also Read: Hyderabad Deer Meat: టోలీచౌకీలో జింక మాంసం.. కొమ్ములు సీజ్ చేసిన అధికారులు

ప్రస్తుత ఎమ్మెల్యేను టార్గెట్

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న జాటోత్ రామచంద్ర నాయక్ ను టార్గెట్ చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ కోలుకోకుండా తనదైన శైలిలో సత్యవతి రాథోడ్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లుగా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రస్తుత ఎమ్మెల్యే వైఫల్యం పై విమర్శలు చేస్తూనే.. మరోవైపు మాజీ మంత్రి రెడ్యానాయక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించకుండా పావులు కలుపుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న 2029 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ కలిసి వస్తే టిఆర్ఎస్(BRS) పార్టీ నుంచి డోర్నకల్ టికెట్ తనకే దక్కుతుందని పలుమార్లు స్పష్టం చేసే విధంగా సత్యవతి రాథోడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే ధీమాతో ముందుకు సాగుతూ ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్(BRS) లో తనదైన శైలిలో ప్రభుత్వంపై తన వాగ్దాటిని చాటుకుంటూ వస్తున్నారు. చిన్నపాటి అవకాశం దొరికితే చాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి తాను ప్రాతినిధ్యం వహించాలని ప్రణాళికలో భాగమేనని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

Also Read: Urea Distribution: గిరిజన భవన్ లో టోకెన్లు… పిఎసిఎస్ లో బస్తాల పంపిణీ

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!