Tollywood Actress: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తన తొలి సినిమా ‘వీరభద్ర’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తనుశ్రీ తిరిగి బాలీవుడ్‌కు వెళ్లి, అక్కడ వరుస అవకాశాలను అందిపుచ్చుకుని మంచి గుర్తింపు పొందింది.
Also Read: Mirai Music Director: ‘మిరాయ్’లో రాములవారి పోర్షన్ చేయడానికి ఎంత టైమ్ పట్టిందంటే..
అయితే, ఆమె వ్యక్తిగత జీవితంలో ఇటీవల కొన్ని సమస్యలు ఎదుర్కొంది. తన కుటుంబ సభ్యుల నుండి వేధింపులు ఎదురవుతున్నాయని, ఆ బాధను తట్టుకోలేకపోతున్నానని చెప్తూ ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అది విపరీతంగా వైరల్ అయింది. అయితే, ఈ నేపథ్యంలోనే తనుశ్రీ దత్తా తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ ఆమెను బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం అడగగా, తనుశ్రీ షాకింగ్ సమాధానం ఇచ్చింది.
“బిగ్ బాస్ షో అంటేనే నాకు నచ్చదు. అక్కడికి వెళ్ళాక .. పేరు ఏమో కానీ, ఉన్న పేరు కూడా పోతాది. నాకు ఆ షో అంటే మొదటి నుంచి అస్సలు ఇష్టం లేదు. కొంచం కుడా ఆసక్తి లేదు. ప్రతి ఏడాది ఆ షో నుండి ఆఫర్ వస్తోంది. కానీ, ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచించలేదు. ఓ సారి నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు.. నేను నో అన్నాక కూడా అంతకన్నా ఎక్కువ ఇస్తాము మీరు రావాలని అడిగారు. కానీ, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. ఎందుకంటే, బిగ్ బాస్ ఫార్మాట్.. ఆ రూల్స్ నాకు అస్సలు నచ్చవు. అక్కడ మగవాళ్లు, ఆడవాళ్లు ఒకే బెడ్‌ను పంచుకోవడం, అదే చోట గొడవలు పడటం నాకు నచ్చదు. నేను నా ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాను. కేవలం ఒక రియాలిటీ షో కోసం మరొకరితో బెడ్ పంచుకునేంత పిచ్చి దాన్ని కాదు. ఆ టీం ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా, బిగ్ బాస్‌కు వెళ్లను,” అని స్పష్టంగా చెప్పింది.