Maruthi-Suzuki-Victoris
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Maruti Victoris: సరికొత్త కారును ఆవిష్కరించిన మారుతీ సుజుకీ… ధర, ఇతర వివరాలు ఇవే

Maruti Victoris: మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) కంపెనీ భారత్‌లో సోమవారం సరికొత్త కారును ఆవిష్కరించింది. కొత్త ఎస్‌యూవీ విక్టోరిస్ (Maruti Victoris) మోడల్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.50 లక్షల ( ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ కారు విక్రయాలు మార్కెట్‌లో మొదలవుతాయి. అయితే, బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మారుతి సుజుకీ విక్టోరిస్ అత్యంత భద్రమైన కారుగా గుర్తింపు పొందింది. గ్లోబల్ ఎన్‌సీఏపీ, భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇప్పటివరకు విడుదలైన మారుతి కార్లలో ఇదే అత్యధిక భద్రత గల కారుగా నిలవడం గమనార్హం.

మారుతి సుజుకీ విక్టోరిస్.. వేరియంట్ వారీగా ధరలు(ఎక్స్-షోరూమ్)

1.5L ఎన్ఏ స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 5ఎంటీ

ఎల్ఎక్స్‌ఐ – రూ.10,49,900, వీఎక్స్ఐ- రూ.11,79,900, జెడ్ఎక్స్ఐ- రూ.13,56,900, జెడ్ఎక్స్‌(వో) – రూ.14,07,900, జెడ్ఎక్స్ఐ ప్లస్-రూ.15,23,900, జెడ్ఎక్స్ఐ ప్లస్ (వో) రూ.15,81,900 గా ఉన్నాయి.

1.5L ఎన్ఏ స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 6ఏటీ

వీఎక్స్ఐ– రూ.13,35,900, జెడ్ఎక్స్ఐ -రూ.15,12,900, జెడ్ఎక్స్ఐ (వో)- రూ.15,63,900, జెడ్ఎక్స్ఐ ప్లస్ -రూ.17,18,900, జెడ్ఎక్స్ఐప్లస్ (వో) – రూ.17,76,900గా కంపెనీ తెలిపింది.

Read Also- KTR: జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

1.5L ఎన్ఏ స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – ఏడబ్ల్యూడీ (6ఏటీ)

జెడ్ఎక్స్ఐప్లస్ – రూ.18,63,900, జెడ్ఎక్స్ఐప్లస్ (వో) -రూ.19,21,900 అని కంపెనీ తెలిపింది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్, ఈ-సీవీటీ)

వీఎక్స్ఐ -రూ.16,37,900, జెడ్ఎక్స్ఐ – రూ. 17,79,900, జెడ్ఎక్స్ఐ (వో) – రూ.18,38,900, జెడ్ఎక్స్ఐప్లస్- రూ.19,46,900, జెడ్ఎక్స్ఐప్లస్ (వో) – రూ.19,98,900 అని మారుతి సుజుకీ ఇండియా తెలిపింది.

1.5L ఎన్ఏ పెట్రోల్ ఎస్-సీఎన్‌జీ- 5ఎంటీ

ఎల్ఎక్స్ఐ -రూ.11,49,900, వీఎక్స్ఐ -రూ.12,79,900, జెడ్ఎక్స్ఐ -రూ.14,56,900 అని కంపెనీ తెలిపింది.

Read Also- KTR vs Bandi Sanjay: బండి సంజయ్‌కు బిగ్ షాక్.. పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. ఎందుకంటే?

కారు ప్రత్యేకతలు ఇవే

విక్టోరిస్ ధరలను ప్రకటన సందర్భంగా , మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల ప్రారంభంలోనే విక్టోరిస్ కారును పరిచయం చేశామని, అప్పటి నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ ఎస్‌యూవీ కారు పట్ల వినియోగదారులు చూపిస్తున్న ఆసక్తి తమకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని చెప్పారు.

కాగా, మారుతి విక్టోరిస్ కారును ఇంటెలిజెంట్ టెక్నాలజీ, హైపర్-కనెక్టెడ్ ఫీచర్లు, అత్యాధునిక, అందమైన డిజైన్, మల్టీ-లెవెల్ సేఫ్టీ వంటి ఫీచర్ల కారణంగా ఈ కారు వినియోగదారులను ఆకర్షిస్తోందని అన్నారు. ప్రారంభ ధర రూ.10,49,900గా ప్రకటించడం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని చెప్పారు. కొత్త తరానికి అనుగుణంగా డిజైన్ రూపొందించామని, రోడ్లపై అడ్వెంచర్ కోరుకునేవారికి, పర్యావరణాన్ని కాపాడాలనే బాధ్యతతో ఉండేవారికి ఈ కారు సరైన ఎంపిక అని పార్థో బెనర్జీ చెప్పారు. స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్‌గ్రిప్ సెలెక్ట్, ఎస్-సీఎన్‌జీ, స్మార్ట్ హైబ్రిడ్ వంటి హైఎండ్ టెక్నాలజీలను ఈ కారు తయారీలో ఉపయోగించారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!