Viral Video: ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లా రామనగర్ ప్రాంతానికి టూరిస్ట్ గా వచ్చిన యూపీ వ్యక్తి.. స్థానిక బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు అతడ్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలికలతో ఎందుకు తప్పుగా ప్రవర్తించావని ప్రశ్నించగా.. తమపైనే తుపాకీ ఎక్కుపెట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
యూపీకి చెందిన పర్యాటకుడు రామనగర్ లోని ఓ రిసార్ట్ లో బస చేశాడు. స్థానిక దుకాణం వద్దకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తూ మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. మెుబైల్ నెంబర్ తీసుకోమని అతడు బలవంతం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాలికల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దీనిపై అతడ్ని ప్రశ్నించగా పర్యాటకుడు రివాల్వర్ బయటకు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్చేస్తానని బెదిరించినట్లు పేర్కొంటున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని తెలియజేశారు.
Also Read: Supreme Court: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ
గ్రామ పెద్ద ఏమన్నారంటే?
టూరిస్ట్ తుపాకీతో బెదిరించినప్పటికీ గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. గ్రామ పెద్ద జగదీశ్ చ్ఛిమ్వాల్ (Jagdish Chhimwal) ప్రకారం.. ఆ పర్యాటకుడు ఆయుధంతో బెదిరించి తన రిసార్ట్ వైపు పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడు మరోసారి రివాల్వర్ తీయబోతున్న సమయంలో గ్రామస్థులు అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Also Read: Diwali 2025: దీపావళిపై కాలిఫోర్నియా సంచలన నిర్ణయం.. గాల్లో తేలిపోతున్న భారతీయులు!
రంగంలోకి పోలీసులు..
దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యూపీకి చెందిన టూరిస్టును అదుపులోకి తీసుకున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ‘ఇలాంటి వ్యక్తులు శాంతి భద్రతలకు ముప్పుగా మారతారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
नैनीताल–रामनगर क्षेत्र में UP के टूरिस्ट की पिटाई। आरोप है कि ये टूरिस्ट रिजॉर्ट के पास दुकान पर सामान लेने गया। वहां बैठी लड़कियों को अपना मोबाइल नंबर दिया। विरोध करने पर उन्हें रिवॉल्वर दिखाई। इस पर लोगों ने इस टूरिस्ट को पकड़ लिया। पिटाई करके पुलिस के हवाले कर दिया#Uttarakhand pic.twitter.com/YUdtBr9574
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) September 15, 2025