Donald Trump: అమెరికాలో భారతీయుడ్ని అతిదారుణంగా తల నరికి చంపిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. భార్య, బిడ్డ అడ్డుకుంటున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని అంగతకుడు.. చంద్ర నాగమల్లయ్య (41)ను కిరాతకంగా చంపాడు. ఆపై మెుండం నుంచి తలను వేరు చేసి.. కాలితే దానిని తన్నుకుంటూ తీసుకెళ్లాడు. డల్లాస్ లో జరిగిన ఈ దారుణ ఘటనపై భారత్ దౌత్యకార్యాలయం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారతీయుడి హత్యపై తొలిసారి స్పందించిన ట్రంప్.. సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే?
డల్లాస్ (Dallas) సముయెల్ బుల్వార్డ్ (Samuell Boulevard)లోని డౌన్‌టౌన్ స్యూట్స్ మోటెల్ (Downtown Suites motel) వద్ద జరిగిన భారతీయుడి హత్య ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ లో పెట్టిన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డల్లాస్‌లో గౌరవనీయుడైన చంద్ర నాగమల్లయ్యను అతని భార్య, కుమారుడి ముందు ఒక అక్రమ వలసదారు క్రూరంగా తల నరికి హతమార్చాడు. అతను అమెరికాలో ఉండకూడని వ్యక్తి. ఇలాంటి దారుణ నేరస్థులను నా పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము. వీరిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం’ అని ట్రంప్ అన్నారు.
‘ఇదంతా బైడన్ వైఫల్యం’
అదే సమయంలో గత బైడెన్ ప్రభుత్వంపై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఈ నిందితుడు గతంలో పిల్లలపై లైంగిక దాడి, వాహన దొంగతనం, అక్రమ నిర్బంధం వంటి ఘోర నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యాడు. క్యూబా దేశం అతడ్ని తిరిగి స్వీకరించకపోవడంతో బైడెన్ ప్రభుత్వం అతడిని సమాజంలోకి విడిచిపెట్టింది. ఇదంతా బైడెన్ వైఫల్యం. నా పాలనలో ఇలాంటి అక్రమ వలస నేరస్తులపై కఠిన చర్యలు తప్పవు’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.
హత్య వీడియో కలకలం
భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను మార్టినేజ్ దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. నాగమల్లయ్యపై పలుమార్లు పదునైన ఆయుధంతో దాడి చేసిన అగంతకుడు కుప్పకూలిపోయినప్పటికీ వదల్లేదు. భార్య, బిడ్డ అడ్డుకుంటున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా అతడి మెడపై పదే పదే పదునైన ఆయుధంతో దాడి చేసి శరీరం నుంచి వేరు చేశాడు. తర్వాత తలను కాలితో తన్ని.. చెత్తబుట్టలో పడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది.
The sad reality is that sporadic violence & terrorism will increasingly become a regular occurrence as the U.S. collapses…@PMOIndia #ChandraNagamallaiahhttps://t.co/tCPOPioUbU
— Nakul Singh Sagwan (@nssagwan_) September 12, 2025
Also Read: Crime News: ఇదేం దారుణం.. ఇచ్చిన బాకీ తీర్చమని అడిగితే చావబాదారు.. ఎక్కడంటే..?
ప్రభుత్వ స్పందన
హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (DHS) ఘటనపై స్పందిస్తూ నిందితుడు మార్టినేజ్.. జనవరి 13, 2025 వరకు బ్లూబోనెట్ డిటెన్షన్ సెంటర్ (ICE Dallas custody) లోనే ఉన్నట్లు పేర్కొంది. తరువాత బైడెన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ‘సూపర్ విజన్ ఆర్డర్’ మీద విడుదలయ్యాడని వెల్లడించారు. DHS అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మెక్‌లాఫ్లి మాట్లాడుతూ ‘బైడెన్ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశంలోకి వదిలివేయడం వల్లే ఈ హత్య జరిగింది. ఇది పూర్తిగా నివారించదగినది’ అన్నారు. ప్రస్తుతం నిందితుడిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియ (Removal Process) ICE ప్రారంభించింది.