Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్
Koppula Eshwar (imagecrdit:twitter)
Political News

Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్

Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉందని, సింగరేణి మనుగడను ప్రభుత్వం కాపాడాలని కోరారు. సీఎంకు తెలంగాణ(Telangana) ప్రాంతం పట్ల, సింగరేణి సంస్థపై ప్రేమ లేదని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టారని, దేశవ్యాప్తంగా 1400 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలను కాపాడటం కోసం బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారని మండిపడ్డారు.

బ్లాకుల వేలం పాటలో

తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి దక్కాలని కేసీఆర్(KCR) ప్రయత్నాలు చేశారన్నారు. కానీ బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక 4బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారని ఆరోపించారు. ఆ 4 బొగ్గు బ్లాకులను కాపాడటం కోసం కేసీఆర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రయత్నం చేసిందన్నారు. కేంద్రంలో బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి(Kisshna Reddy), డిప్యూటీ సీఎం భట్టిబొగ్గు బ్లాకుల వేలం పాటలో కలిసి పాల్గొన్నారని, సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా 35 శాతం లాభాల వాటాను కార్మికులకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాభాల వాటాను 16శాతం నుంచి 32 శాతం వరకు పెంచారని, సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ను పునరుద్ధరణ చేశారన్నారు.

Also Read: Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం

సింగరేణి కార్మికుల్లో భరోసా..

డిపెండెంట్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం సింగరేణి కార్మికుల్లో భరోసా నింపాలని కోరారు. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ కక్షగట్టారని ఆరోపించారు. టీజీబీకేఎస్(TGBKS) నాయకుడు మిర్యాల రాజిరెడ్డి(Raji Reddy) మాట్లాడుతూ సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2050 వరకు థర్మల్ పవర్ వుండవద్దని కుట్ర పన్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించకపోతే కార్యాచరణప్రకటిస్తామని హెచ్చరించారు.

Also Read: Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!

Just In

01

Sai Kumar: ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం

Gram Panchayat: గ్రామపంచాయతీల్లో అట్టహాసంగా నూతన పాలకవర్గాల ప్రమాణస్వీకారం!

Deepu Chandra Das: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్యోదంతంలో సంచలనాలు వెలుగులోకి

New Sarpanch: మందలపల్లి సర్పంచ్‌గా గుజ్జుల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం.. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలనకు హామీ!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ లింకులు తొలగింపు