Bumrah-Pandya
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

IND vs PAK Match: ఆరంభంలో పాక్‌ను బెంబేలెత్తించిన పాండ్యా, బుమ్రా.. టాస్ సమయంలో ఊహించని సీన్లు

IND vs PAK Match: ఆసియా కప్ -2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ (IND vs PAK Match) షురూ అయ్యింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశ ప్రజల్లో తీవ్ర భావోద్వేగాలు నెలకొన్న వేళ ఈ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌పై టీమిండియా ఆరంభంలోనే అదిరిపోయే రీతిలో సత్తా చాటింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ బుమ్రా కాంబినేషన్ పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించింది.

తొలి ఓవర్ వేసిన హర్ధిక్ పాండ్యా మొదటి బంతి వైడ్ వేయగా, ఆ తర్వాతి బంతికి వికెట్ తీశాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని పాక్ ఓపెనర్ సైమ్ ఆయుబ్ కొట్టాడు. బంతి నేరుగా వెళ్లి జస్ప్రీత్ బుమ్రా చేతుల్లో పడింది. దీంతో, పాక్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఒక వైడ్‌తో కలిపి ఫస్ట్ ఓవర్‌లో పాక్ కేవలం 5 పరుగులు మాత్రమే సాధించింది.

Read Also- Ind Vs Pak Toss: టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఇక రెండో ఓవర్‌ వేసిన జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికే మహ్మద్ హ్యారీస్ వికెట్ తీశాడు. షాట్ ఆడే ప్రయత్నం చేసిన హ్యారీస్ బంతిని బలంగా కొట్టాడు. కానీ, బంతి గాల్లోకి లేచింది. దానిని హార్ధిక్ పాండ్యా చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. అదే ఓవర్‌లో మరో వికెట్ దక్కినంత పనైంది. అంపైర్ ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించినప్పటికీ, పాక్ ప్లేయర్ రివ్యూ కోరడంతో నాటౌట్‌గా తేలింది. బుమ్రా వేసిన ఆ ఓవర్‌లో పాకిస్థాన్ కేవలం 2 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడినట్టు అయింది. పాక్ అభిమానులైతే స్టేడియంలో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. నిరాశగా కనిపించారు. మరోవైపు, భారత అభిమానులు పండుగ చేసుకున్నారు. హర్షధ్వానాలతో మైదానాన్ని మోతెక్కించారు. విజిల్స్, చప్పట్లతో భారత ప్లేయర్లను ఉత్సాహపరిచారు.

Read Also- Ind vs Pak Match: దుబాయ్ స్టేడియానికి హై సెక్యూరిటీ.. ఫ్యాన్స్‌కు అనూహ్య రూల్స్!

టాస్ సమయంలో ఊహించని సీన్లు

టాస్ సమయంలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. కనీసం ఒకరివైపు మరొకరు చూసుకోలేదు. క్రీడల్లో అనుసరించే హృదయపూర్వక సంజ్ఞలు ఇచ్చుకోలేదు. టాస్‌కు ముందు, టాస్ తర్వాత కూడా ఒకరివైపు మరొకరు చూడలేదు.

కాగా, కాగా, పాకిస్థాన్ బ్యాటింగ్ 9 ఓవర్లు ముగిసిన సమయానికి 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

Just In

01

OG advance booking: ఆ రికార్డుపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి మనదే అంటున్న ఫ్యాన్స్

Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు

Ponnam Prabhakar: జీఎస్టీ టాక్స్ తో ఏం మంచి పని జరిగింది?.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

OG release: ఉత్తరాంధ్రలో ‘ఓజీ’ బ్యాంగ్ మోగించేందుకు సర్వం సిద్ధం..

Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?