Pixium: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సహకారం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం తెలిసిన ఎల్ఈడీ మానుఫ్యాక్చురింగ్ సంస్థ పిక్సియమ్ భారీ పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణకు రాబోతోంది. పిక్సియమ్ డిస్ ప్లే టెక్నాలజీస్ మొదటి దశలో రూ.200 -250 కోట్లతో ఎల్ఈడీలు, మైక్రో ఎల్ఈడీలు, ఆడియో వీడియో కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా వెయ్యిమందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండో దశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిని పిక్సియమ్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. రెండో దశలో 5 వేల మందికి నేరుగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Also Read- CM Revanth Reddy: కృష్ణా నీటి కోటా సాధించటంలో కేసీఆర్ విఫలం… సీఎం సంచలన కామెంట్స్!
పిక్సియమ్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ఎల్ఈడీలు, మైక్రో ఎల్ఈడీలు, ఆడియో వీడియో కాంపోనెంట్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనుంది. పిక్సియమ్‌కు చైనాకు చెందిన ఏఈటీ ప్రో ఏవీ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. పిక్సియమ్ డైరెక్టర్లు పేరం శరత్ బాబు, చరుకుపల్లి రాకేష్ రెడ్డితో పాటు, ఏఈటీ ప్రో డైరెక్టర్లు సు పైవో కో, హాన్ కిట్ చాన్, ప్రశాంత్ శ్రీవాస్తవ.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుపై చర్చలు జరిపారు.
Also Read- India vs Pak Match: ‘భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్’ డిమాండ్లపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్పందన
పిక్సియమ్ ప్రతిపాదనలపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. ఈ సంస్థకు గుజరాత్, తమిళనాడు ఆహ్వానం పలికినప్పటికీ, ప్రభుత్వ సహకారం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండడంతో తెలంగాణనే తమ పరిశ్రమ ఏర్పాటుకు ఎంచుకున్నట్లుగా పిక్సియమ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు