GHMC sanitation: పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపునకు బల్దియా శానిటేషన్ డ్రైవ్
సోమవారం సాయంత్రం వరకు కొనసాగనున్న డ్రైవ్
572 వాహనాలతో జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలింపు
110 జేసీబీల వినియోగం
14 వేల 500 మంది వర్కర్లు.. మూడు షిఫ్టుల్లో విధులు
కొనసాగుతున్న చెత్త సేకరణ, స్వీపింగ్, క్లీనింగ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహానగరంలో రెండు రోజుల పాటు జరిగిన వినాయక నిమజ్జనంలో భాగంగా జీహెచ్ఎంసీ సుమారు 11 వేల 200 మెట్రిక్ టన్నుల చెత్తను (GHMC sanitation) సేకరించి 572 వాహనాలతో శివారులోని జవహర్ నగర్ ప్రాసెసింగ్ సెంటర్డం పింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇదంతా గత నెల 27న వినాయక చవితి మొదలైనప్పటి నుంచి ఆదివారం సాయంత్రం వరకు సేకరించిన చెత్తగా అధికారులు వెల్లడించారు. సేకరించిన చెత్తలో ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు, గ్లాస్‌లు, పూలు, ఇతర పూజా సామాగ్రి, డెకరేషన్ మెటీరియల్ ఉన్నట్లు తెలిపారు. శనివారం మొదలైన ఫైనల్ నిమజ్జనానికి ముందే బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకున్న 21 కిలోమీటర్ల మేర శోభా యాత్ర రూట్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మొత్తం 303 కిలోమీటర్ల పొడువున నిమజ్జనం రూట్‌లో ఎప్పటికపుడు చెత్తను తొలగించేందుకు నియమించిన సుమారు 14 వేల వేల 500 మంది శానిటేషన్ సిబ్బందితో ఆదివారం మధ్యాహ్నాం నుంచి సోమవారం సాయంత్రం వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను కొనసాగించనుంది.
Read Also- Cherlapally Drug Case: చర్లపల్లి డ్రగ్ కేసులో బయటపడిన సంచలన వివరాలు
హుస్సేన్ సాగర్ చుట్టూ శనివారం ఉదయం నుంచి 2 వేల మంది షిఫ్టుల వారీగా కార్మికులు చెత్త సేకరణ, స్వీపింగ్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ శాశ్వత, తాత్కాలిక, ఎక్సవేటర్ పద్దతుల్లో ఏర్పాటు చేసిన 74 నిమజ్జన కొలనుల నుంచి 1,200 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించగా, ఈ సారి 200 మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు పెరిగాయి. ఇందుకు గాను రెగ్యులర్‌గా వినియోగించే 330 వాహనాలతో పాటు అదనంగా మరో 97 వాహానాలు, అలాగే రెగ్యులర్‌గా వినియోగించే 40 జేసీబీలకు అదనంగా మరో 70 జేసీబీలను వినియోగించి ఈ చెత్తను తీసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌తో పాటు మరి కొన్ని చెరువులు, కొలనుల్లో చెత్తను ఇంకా సేకరించి, తొలగిస్తున్న ప్రక్రియ జరుగుతున్నందున, సోమవారం ఉదయం వరకు ఈ చెత్త మరిన్ని టన్నులు పెరిగే అవకాశముంది. అప్పర్ ట్యాంక్ బండ్‌పై రోడ్డును వాటర్‌తో కార్మికులు క్లీనింగ్ చేశారు.
Read Also- Ganesh Immersion: వెరీ గుడ్ ఆఫీసర్స్, స్టాఫ్.. సీఎం రేవంత్ అభినందనలు.. ఎందుకంటే?
కొనసాగుతున్న వ్యర్థాల సేకరణ
హుస్సేన్ సాగర్‌లోని వ్యర్థాలు, పూజా సామగ్రిని వేర్వేరు చేసి జీహెచ్ఎంసీకి ఎంటమాలజీ విభాగం కార్మికులు ఇంకా సేకరిస్తున్నారు. ఒక్క హుస్సేన్ సాగర్ చెరువు చెట్టూ వ్యర్థాల సేకరణకు సుమారు 2 వేల మంది కార్మికులను నియమించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మరో 33 ప్రాంతాల్లోని చెరువుల వద్ద వ్యర్థాల సేకరణ సాయంత్రంతో ముగియగా, జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పాండ్ల వద్ద వ్యర్థాల సేకరణ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగనున్నట్లు సమాచారం.