Jajula Surender: వరదల నష్టంపై సమీక్షలు కాదు సత్వర చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్(Jajula Surender) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వరదలు వచ్చి తొమ్మిది రోజులు గడిచిందని, కొండాపూర్(Kondapur) లో రెండు చెరువులు తెగిపోయి అనేక తండాలు జల దిగ్భంధం లో చిక్కుకున్నాయన్నారు. పోచారం డ్యామ్ బ్యాక్ వాటర్స్ తగ్గిపోయి నష్టం తగ్గింది కానీ ప్రభుత్వం చేసిందేమి లేదు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సీఎం మంత్రులు విహార యాత్రకు వచ్చినట్టు వచ్చి వెళ్లారన్నారు. రైతులంటే అంత చులకనా ? అని ప్రశ్నించారు.
రైతులకు ఉచిత ఎరువులు
దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సీఎం సరిగా స్పందించలేదన్నారు. కేంద్ర నిధుల పైనే సీఎం ఆధారపడ్డారని మండిపడ్డారు. దాదాపు 18 వేల మంది రైతులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారంతో పాటు రబీలో రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి అంత నిర్లక్ష్యమా ? యూరియా కోసం లైన్లలో నిలబడ్డ రైతులను సీఎం సినిమా టిక్కెట్లకు నిలబడ్డ వారితో సీఎం పోల్చడం సిగ్గు చేటు అన్నారు.
Also Read: Urea Shortage: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా మంటలు.. క్యూ లైన్ లలో మహిళా రైతులు
అవమానంగా మాట్లాడుతారా?
రైతులకు యూరియా బతుకు దెరువు.. ఇంత తీవ్ర మైన సమస్యపై సీఎం అంత అవమానంగా మాట్లాడుతారా? అని నిలదీశారు. రైతులు రేవంత్ కు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను అపహాస్యం చేస్తే ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి డిసెంబర్ ఫోబియా పట్టుకుందన్నారు. పోలీసుల పహారాలో యూరియాను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ , నేతలు శ్రీనివాస్ నాయక్ ,శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Drugs Seized: ఈ డ్రగ్ వాడితే.. డా.సమరంతో పనిలేదట.. నైజీరియన్ అరెస్ట్