Drugs Seized (imagecredit:swetcha)
హైదరాబాద్

Drugs Seized: ఈ డ్రగ్ వాడితే.. డా.సమరంతో పనిలేదట.. నైజీరియన్ అరెస్ట్

Drugs Seized: గే యాప్​ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఈస్ట్ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు చిలకలగూడ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. విచారణలో వెల్లడైన వివరాలతో వీరి నుంచి మాదక ద్రవ్యాలు కొంటున్న మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ డాక్టర్ కూడా ఉన్నాడు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 15లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్(MDMA drug) ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ అసహజ లైంగిక కార్యకలాపాలకు అలవాటు పడి డ్రగ్స్ తీసుకుంటుండటం.. వీరిలో కొందరికి హెచ్​ఐవీ(HIV) సోకటం గమనార్హం.

ఈస్ట్ జోన్​ డీసీపీ బాలస్వామి(DCP Balaswami) టాస్క్​ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు, ఈస్ట్ జోన్​ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్​ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన ఎం.రమాకాంత్ ఎలియాస్​ కిరణ్​ (44) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో 2000వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాడు. చిలకలగూడలో నివాసముంటూ ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్​ గా పని చేస్తున్నాడు. ఇక, హైదరాబాద్ వచ్చిన యేడాదే రమాకాంత్ వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య విభేధాలు తలెత్తాయి. దాంతో భార్య అతన్ని వదిలేసింది.

లైంగిక సామర్థ్యం కోసం…

ఈ క్రమంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం రమాకాంత్(Ramakanth) ఎండీఎంఏ డ్రగ్ తీసుకోవటం మొదలు పెట్టాడు. గ్రైండర్(Grinder App) అనే గే యాప్​ ద్వారా కొంతమంది యువకులకు మాదక ద్రవ్యాలు అమ్ముతూ వారితో అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో రమాకాంత్ కు హెచ్ఐవీ సోకింది. అయినా, రమాకాంత్ యువకులను తన ఫ్లాట్ కు పిలిపించుకోవటంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి డ్రగ్స్ ఇస్తూ కోరికలు తీర్చుకోవటాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతనికి వాక్యూం టెక్నీషియన్​ గా పని చేస్తున్న ముదావత్ ప్రసాద్​ (30)తో పరిచయం ఏర్పడింది.

నైజీరియన్​ నుంచి…

ఆ తరువాత ముదావత్ ప్రసాద్ తో కలిసి రమాకాంత్ ఎండీఎంఏ డ్రగ్ అమ్మటం మొదలు పెట్టాడు. తరచూ బెంగళూరు వెళుతూ అక్కడ ఉంటున్న ఓ నైజీరియన్ నుంచి గ్రాము ఎండీఎంఏను 10వేల రూపాయలకు కొని తెచ్చి ఇక్కడ 15వేల రూపాయలకు గ్రాము చొప్పున అమ్ముతున్నాడు. ఇలా డ్రగ్ అమ్ముతూ 2024, జూలైలో రమాకాంత్, ముదావత్ ప్రసాద్ లు చిలకలగూడ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన రమాకాంత్ డ్రగ్స్ అమ్మకాలను తిరిగి కొనసాగించాడు.

Also Read: HHVM: ‘హరి హర వీరమల్లు’ నుంచి బయటకు రావడానికి అసలు కారణం ఏంటో చెప్పిన క్రిష్!

సమాచారాన్ని సేకరించి…

రమాకాంత్, ముదావత్ ప్రసాద్ లు సాగిస్తున్న డ్రగ్స్ దందా గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఈస్ట్ జోన్​ టాస్క్​ ఫోర్స్ సీఐ నాగార్జున, చిలకలగూడ బీ.అనుదీప్​, ఎస్​ఐలు మనుషా రెడ్డి, ఎస్​.కరుణాకర్​ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి రమాకాంత్ ఫ్లాట్ పై దాడి చేశారు. డ్రగ్స్​ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

డాక్టర్ తోపాటు…

ఈ ఇద్దరిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ మరో ఏడుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మలక్ పేట(Mlakpet)లోని ఇండో యూఎస్​ హాస్పిటల్(Indo US Hospital) లో సర్జన్​ గా పని చేస్తున్న డాక్టర్​ ఆతిఫ్​ అబ్దుల్​ సమీ(Dr. Atif Abdul Sami) (38), మాదాపూర్​ నివాసి, సెక్స్​ వర్కర్​ అయిన కరిచెర్ల వినయ్​ కుమార్ (30), మెన్స్​ హాస్టల్ ఉద్యోగి కొత్తపల్లి మోషా ఎలియాస్ మోజెస్​ (29), బల్లం వంశీకృష్ణ (38), కేతావత్ రాజు నాయక్​ ఎలియాస్​ నాయక్​ (29), ఐటీ రిక్రూటర్​ గా పని చేస్తున్న షేక్​ సమీర్​, ప్రైవేట్ ఉద్యోగి ఆదేపు సత్య సురేష్​ బాబు ఎలియాస్ సురేష్​ (51) ఉన్నారు. నిందితులు స్వలింగ సంపర్కానికి అలవాటు పడి డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా డీసీపీ బాలస్వామి చెప్పారు. ఈ క్రమంలో కొందరికి హెచ్​ఐవీ కూడా సోకిందని తెలిపారు. యువకులు ఇలాంటి వారి ఉచ్ఛులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నైజీరియన్​ అరెస్ట్

అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ ను హైదరాబాద్(Hyderabad)​ నార్కొటిక్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితున్ని స్వదేశానికి పంపించే ప్రక్రియను పూర్తి చేశారు. డీసీపీ సుధీంద్ర(DCP Sudhindra) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియా(Nigeria) దేశానికి చెందిన అలీ ఎనుకే ఫార్చునటస్ అకుడిన్వా ఎలియాస్ ఫార్చూన్​(Ali Enuke Fortunatus Akudinwa Elias Fortune) (30) తొమ్మిదేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై మన దేశానికి వచ్చాడు. ఆ తరువాత హైదరాబాద్​(Hyderabad) చేరుకుని హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని వేర్వేరు పబ్బుల్లో డీజేగా పని చేయటం మొదలు పెట్టాడు.

అదే సమయంలో తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందా కూడా ప్రారంభించాడు. కాగా, లంగర్​ హౌస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫార్చూన్​ ను హైదరాబాద్ నార్కొటిక్​ ఎన్​ ఫోర్స్​ మెంట్ వింగ్ సీఐ బాలస్వామి ఎస్​ఐ మనోజ్​ కుమార్​ తో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఫారినర్స్​ రీజనల్​ రిజిస్ట్రేషన్​ ఆఫీస్ వర్గాలతో తనిఖీ చేయించగా అతని వీసా కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది. అక్రమంగా ఇక్కడ ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. కొద్దిలో తప్పించుకున్న బైకర్!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం