Delhi Case
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: భార్య, అత్తను చంపేసిన వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Crime News: కుటుంబ కలహాలు దారుణ హత్యలకు దారితీస్తున్న షాకింగ్ ఘటనలు (Crime News) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఓ వ్యక్తి తన భార్య, అత్తను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఓ కత్తెరను ఉపయోగించి ఇద్దరినీ హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శనివారం ఈ హత్య జరిగిందని తెలిపారు. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా బహుమతుల విషయంలో అత్తింటి కుటుంబం, తన కుటుంబం మధ్య గొడవ జరగడంతో, యోగేష్ అనే వ్యక్తి తన భార్య ప్రియ సెహగల్ (34), అత్తయ్య కుసుమ్ సిన్హా (63)ను శనివారం హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శనివారం మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో కేఎన్‌కే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు ఒక వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చిందని, రోహిణి సెక్టార్-17లో ఓ ఇంట్లో తన తల్లి, అక్క విగతజీవులుగా పడివున్నారంటూ సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుసుమ్ సిన్హా (63), ఆమె కూతరు ప్రియ సెహగల్ (34) మృతదేహాలు ఒకే గదిలో పడివుండడాన్ని గుర్తించారు. ఫోన్ చేసి సమాచారం అందించింది కుసుమ్ సిన్హా కొడుకు మేఘ్ సిన్హా (30) అని వెల్లడించారు. ఆగస్టు 28న మనవడు చిరాగ్ పుట్టినరోజు వేడుకల కోసం తల్లి కుసుమ్.. తన కూతురు ప్రియ ఇంటికి వెళ్లిందని, పుట్టినరోజు వేడుక సమయంలో, ప్రియ-భర్త యోగేష్ మధ్య బహుమతుల విషయంలో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి కుసుమ్ అక్కడే ఉండిపోయారని వెల్లడించారు.

Read Also- Modi Xi Meet: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి.. కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

‘‘ మా అమ్మతో మాట్లాడేందుకు ఆగస్టు 30న ఫోన్ చేశాను. కానీ, ఎలాంటి స్పందనా లేదు. ఎన్నిసార్లు చేసినా అక్క నుంచి రెస్పాన్స్ లేదు. అందుకే అక్క ప్రియ ఇంటికి వెళ్లాను’’ అని మేఘ్ సిన్హా పోలీసులకు వెల్లడించాడు. తాను వెళ్లేసరికి ఇంటి తలుపు బయట నుంచి లాక్ చేసి ఉన్నాయని, డోర్ వద్ద రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే ఇతర కుటుంబ సభ్యులు, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించానని తెలిపాడు. తాను తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా, ఒక గదిలో తన తల్లి, అక్క మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యానని వివరించాడు. అక్క ప్రియ భర్త యోగేష్ సెహగల్ ఈ హత్య చేసి పారిపోయాడని, అతడొక నిరుద్యోగి అని మేఘ్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లి, అక్కను హత్య చేసి పిల్లలతో పారిపోయాడని చెప్పారు.

Read Also- Ustaad Bhagat Singh update: పవన్ అభిమానులు రెడీగా ఉండండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఎప్పుడంటే?

సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. యోగేష్‌ను కేఎన్‌కే మార్గ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నేరానికి వాడినట్లు అనుమానిస్తున్న కత్తెర (scissors), రక్తంతో తడిసిపోయిన దుస్తులను నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలను ఘటనా స్థలానికి వెళ్లి నమూనాలను సేకరించాయి. వివరాలను విశ్లేషించారు. కాగా, ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం