Narendra-Modi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Modi Xi Meet: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి.. కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Modi Xi Meet: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో (Modi Xi Meet) సమావేశమయ్యారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న వీరిద్దరి భేటీ చైనా పోర్ట్ సిటీగా పిలుచుకునే తియాంజిన్‌ నగరంలో జరిగింది. ఇరువురి భేటీ అనంతరం ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా భారత-చైనా సంబంధాలు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ‘‘ఇరుదేశాలకు చెందిన సుమారు 280 కోట్ల జనాభా ప్రయోజనాలు పరస్పర సహకారంతో ముడిపడి ఉన్నాయి. ఇరుదేశాల మధ్య సహకారం సమస్త మానవాళి సంక్షేమానికి బాటలు వేస్తుంది. పరస్పర నమ్మకం, గౌరవం, సున్నిత అంశాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఆధారంగా ఇరుదేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Read Also- Ustaad Bhagat Singh update: పవన్ అభిమానులు రెడీగా ఉండండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఎప్పుడంటే?

ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ దాదాపు ఒక గంటపాటు కొనసాగింది. ఇరుదేశాల మధ్య ఇటీవల చోటుచేసుకున్న సానుకూల పరిణామాల మెరుగుదలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు ప్రతిష్టంభనపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య అంగీకారం, కైలాస మానస సరోవర్ యాత్ర పున:ప్రారంభం, ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ వంటి అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చలో ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాలపై భారత్, చైనా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ట్రంప్‌కు గట్టి సంకేతాలు ఇచ్చేలా ‘మోదీ-జిన్‌పింగ్’ బలంగా చేతులు (షేక్‌హ్యాండ్) కలిపారు. చాలాకాలం పాటు ప్రత్యర్థులుగా ఉన్న ఇరుదేశాల అధినేతలు ఈ భేటీ ద్వారా స్నేహపూర్వక సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఈ భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక సందేశంలా ఉంటుందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.

Read Also- Pawan Kalyan: లేట్ నైట్ అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం.. అందుకు బాధగా ఉందన్న పవన్

జిన్‌పింగ్ ఏమన్నారంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్వాగతం పలికారు. మోదీతో భేటీ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, చైనాకు భారత్ ఎంతో కీలకమైన మిత్రుదేశమని అభివర్ణించారు. భారత-చైనా సంబంధాలను వ్యూహాత్మకంగా, దీర్ఘకాల దృష్టి కోణం చూడాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం, సరిహద్దు సమస్య ఒక్కటే భారత్-చైనా సంబంధాలను నిర్ణయించకూడదని జిన్‌పింగ్ సూచన చేశారు. ఆసియా ఖండంలో ప్రధాన శక్తులుగా ఉన్న భారత్, చైనా పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా, భాగస్వాములుగా, మిత్రులుగా చూడడంపై దృష్టి పెడితే, ఈ సంబంధాలు భవిష్యత్తులో ఆశాజనకంగా, స్థిరంగా, మరింత విశాలంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా ‘జిన్హువా’లో ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచంలో వందేళ్లకు ఒకసారి చోటుచేసుకునే మార్పులు ఇప్పుడు జరుగుతున్నాయని మోదీకి జిన్‌పింగ్ చెప్పారు. ‘‘ప్రపంచ రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం గందరగోళంగా ఉన్నాయి. చైనా – భారత్ దేశాలు తూర్పున ఉన్న రెండు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలు. ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా ఉన్న అగ్రదేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలో అత్యంత పురాతన సభ్యులు కూడా. మంచి మిత్రులుగా, మంచి పొరుగు దేశాలుగా ఉండడం చాలా ముఖ్యం. డ్రాగన్ (చైనా), ఎలిఫెంట్ (భారత్) కలిసి రావడం చాలా అవసరం’’ అని జీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం