Urea Shortage: మహబూబాబాద్ జిల్లాలోని యూరియా(Urea) కోసం రైతులు మంటలు మండుతున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్ లలో నిలబడిన మహిళ రైతులు, సహనం కోల్పోతున్నారు. అనుకున్న సమయానికి యూరియా(Urea) బస్తాలు లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గెలిచిండు కూసుండు రైతుల(Farmers) బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సూర్య టాకీస్ ఎదురుగా ఉన్న మన గ్రోమోర్ సెంటర్లో యూరియాను రైతుల(Farmers) కు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఆ షాపు ముందు రైతులు(Farmers) బారులు తీరారు.
నిర్ణీత సమయంలో మన గ్రోమోర్ సెంటర్ తెరవాల్సి ఉండగా అక్కడ యూరియా రైతులకు సరిపడా లేకపోవడంతో ఆ షాపు తీయకుండానే అధికారులు మరిచిపోయారు. రైతులు మన గ్రోమోర్ సెంటర్లో నిలబడి నిలబడి సహనాన్ని కోల్పోయి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వంద బస్తాలు ఉన్నాయని సమాచారం మేరకు దాదాపు 300 నుంచి 400 మంది రైతులు ఆ షాపు ఎదుట క్యూ లైన్ లో నిలబడ్డారు. 11:30 నుంచి 12:30 మధ్య సమయంలో కూడా షాపు తెరవకపోవడంతో రైతులు(Farmers) తమ నోటికి పని చెప్పి ఆవేదన వెళ్లగకుతున్నారు. రైతుల(Farmers)తో పాటు మహిళా రైతులు సైతం క్యూ లైన్ లలో యూరియా బస్తాల కోసం నిలబడ్డారు.
Also Read: The Bengal Files: సీఎంకు దర్శకుడు విన్నపం.. చేతులు జోడించినా రాని ఫలితం
ఎంతవరకు సమంజసం?
12:30 గంటలు దాటినప్పటికీ అతిగతి లేకపోవడంతో తీవ్ర ఆక్రోషంతో మాట్లాడుతున్నారు. పది ఎకరాల వ్యవసాయం చేసే తమకు ఒక్క బస్తా యూరియా అందకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు. కూలోళ్లను పెడితే ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు చేలలో పని చేసుకునే తమను యూరియా(Urea) బస్తాల కోసం లైన్లో వేచి ఉంచేలా అధికారులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే మహబూబాబాద్ పిఏసిఎస్ కేంద్రానికి వచ్చిన రైతులు చెట్ల కింద పడి కాపులు కాస్తున్నారు. అసలు యూరియా ఇస్తారో లేదో అని ఆందోళనలో రైతులు(Farmers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేస్తే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు బిక్కు బిక్కుమంటున్నారు.
అటు వ్యవసాయం చేసుకోవాలా లేదంటే యూరియా(Urea) బస్తాల కోసం లైన్లో వేచి ఉండాల తేల్చుకోలేని పరిస్థితిలో రైతులు అయోమయం చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కి ఫోన్ చేస్తే స్పందించిన దుస్థితి ఏర్పడుతుందని రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏరియా వచ్చిందా.. లేదంటే వచ్చిన ఇవ్వడం లేదా.. అసలు యూరియా కేంద్రాలకు యూరియా చేరుకున్నదా.. లేదా అనే విషయంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టత నివ్వకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలలో కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ రైతుల(Farmers) కు యూరియా పంపిణీ చేసి ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని రైతులు(Farmers) వేడుకుంటున్నారు.
మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల ఇక్కట్లు
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు(Farmers) తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వచ్చిన యూరియా(Urea)ను ఎవరికి ఇవ్వాలో తెలియని దుస్థితిలో ఉన్నారు. మరిపెడ ఏడిఏ విజయ్ చంద్ర రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఎవరికి సర్ది చెప్పాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. యూరియా గొడవ మిన్నంటడంతో అధికారులు సైతం గగ్గోలు పడుతున్నారు. అటు రెవెన్యూ, పోలీసులు, ఇటు వ్యవసాయ అధికారులు రైతులకు అందించాల్సిన యూరియా సరఫరా లేకపోవడంతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారిపోతుంది.
ఆధార్ కార్డుల ద్వారా జాబితా తయారుచేసిన అధికారులు ఆ జాబితా ప్రకారం కూడా యూరియాను అందించలేని దుస్థితిలో ఉన్నారు. పిఎసిఎస్ కేంద్రాలకు యూరియా వచ్చిందని సమాచారం మేరకు ఆయా కేంద్రాల వద్ద రైతులు(Farmers) బారులు తీరారు. యూరియా కోసం లైన్లో నిలబడుతూ అసలు యూరియా అందుతుందా లేదంటే ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందా అనేది సైతం తేల్చుకోలేని పరిస్థితి రైతుల(Farmers)కు దాపిరించింది. ముందస్తు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితికి కారణం అవుతుందని రైతులు(Farmers) ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికారులు సైతం జిల్లాలో ఏ రైతుకు ఎంత అవసరమవుతుందో తెలుసుకోలేని దుస్థితిని తీసుకొచ్చారని రైతులు (Farmers)విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కొత్తగూడెం పొగళ్లపల్లి పిఎసిఎస్ లో యూరియా బస్తాలు మాయం
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లోని కొత్తగూడెం మండలం పొగడ్లపల్లి పిఎసిఎస్ లో నిల్వచేసిన ఏరియా బస్తాలు మాయం కావడంతో అక్కడి అధికారులు అయోమయానికి గురయ్యారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించి యూరియా బస్తాలను అపహరించుకుపోయిన వారి వివరాలను సేకరించారు. అయితే పిఎసిఎస్ లలో పనిచేసే సిబ్బంది తమకు కూడా యూరియా బస్తాలు అందకపోవడంతో అందుబాటులో ఉన్న యూరియా బస్తాలను దాదాపు 20 మంది వరకు 96 బస్తాలను అపహరించుకుపోయినట్లు స్థానిక ఎస్సై, ఎమ్మార్వో గుర్తించారు. సకాలంలో యూరియా లభించకపోవడంతోనే తమకు కూడా వ్యవసాయం ఉన్నందున యూరియా బస్తాలను పిఎసిఎస్ నుంచి తామే తీసుకెళ్లి వాడుకున్నామని చెప్పినట్లుగా అధికారులు వెల్లడించారు.
Also Read: Kadiyam Srihari: చివరి శ్వాస వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు