Scam at Erragadda Hospital: రోగుల డైట్ పేర కాంట్రాక్టర్ లక్షల రూపాయలు బుక్కేస్తున్నాడు. అవినీతికి మరిగిన కొందరు అధికారులు దీనికి సహకరిస్తున్నారు. ఈ బాగోతం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో జరుగుతోంది. ఆస్పత్రికి ఇన్ ఛార్జ్ సూపరిండింటెంట్ గా డాక్టర్ మమతా కస్తూరిబాయి(Dr. Mamata Kasturibai) వచ్చిన తరువాత జరిపిన ఆడిట్ లో నెలల తరబడిగా డైట్ పేర సాగుతున్న దోపిడీ వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ముమ్మర విచారణ చేస్తున్నారు. ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి(Government Ayurveda Hospital in Erragadda)లో మొత్తం 204 బెడ్లు ఉన్నాయి. అయితే, ఇన్ పేషంట్ల సంఖ్య 40 నుంచి 50మంది మధ్యనే ఉంటుందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఇన్ పేషంట్ గా చేరే రోగులకు డైట్ ఖర్చలు కింద రోజుకు 80 రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. సరిగ్గా దీనినే డైట్ కాంట్రాక్టర్ అక్రమ సంపాదనలకు అనువుగా మలుచుకున్నాడు.
డైట్ కాంట్రాక్టర్ స్వాహా
ఇన్ పేషంట్ల సంఖ్య 50 దాటకున్నా 170 నుంచి 180మందికి డైట్ ఇస్తున్నట్టు రికార్డుల్లో చూపిస్తూ నెల నెలా లక్షల రూపాయలు సొంత జేబులో వేసుకుంటున్నాడు. ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ప్రతీనెలా డైట్ బిల్లులు దాదాపు 5లక్షలు వస్తోందని, దీంట్లో సగానికి పైగా డైట్ కాంట్రాక్టర్ స్వాహా చేస్తున్నాడని తెలిసింది. దీనికి పై సంపాదనలకు మరిగిన కొందరు అధికారులు సహకరిస్తూ వస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం వీళ్లు కీలక స్థానాల్లో ఉన్నారని తెలియవచ్చింది. కొంతకాలం క్రితం ఆయుర్వేద ఆస్పత్రికి ఇన్ ఛార్జ్ సూపరిండింటెంట్ గా డాక్టర్ మమతా కస్తూరిబాయి బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత డైట్ లెక్కలు, కేస్ షీట్లకు పొంతన లేకపోవటంతో డైట్ పేర కాంట్రాక్టర్ చేస్తున్న మోసం వెలుగు చూసినట్టు సమాచారం. ఈ అవినీతి బాగోతం ఆయుష్ డైరెక్టర్ దృష్టికి వెళ్లటం…ఆ తరువాత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందటం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.
Also Read: Natural Remedies: ఇవి మీ ఇంట్లో ఉంటే దోమలు పారిపోతాయ్.. అస్సలు కుట్టవు?
12మంది నుంచి వివరాల సేకరణ…
దర్యాప్తులో భాగంగా ఆయుర్వేద ఆస్పత్రిలో పని చేస్తున్న 12మంది డాక్టర్ల నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. కాయ చికిత్స డాక్టర్ లక్ష్మీకాంతం, పంచకర్మ విభాగం డాక్టర్ ప్రవీణ్, శల్య డిపార్ట్ మెంట్ కు చెందిన డాక్టర్ ప్రభాకర్, శలక్య నాస ముక్త దంత విభాగానికి చెందిన డాక్టర్ సీహెచ్.రమాదేవి, కౌమరభృత్య డిపార్ట్ మెంట్ కు చెందిన డాక్టర్ యశోధ, ప్రసూతి, స్త్రీరోగ విభాగానికి చెందిన డాక్టర్ సులోచన, రీసెర్చ్ వింగ్ లో ఉన్న అగడ తంత్ర డాక్టర్ అనిల్ కుమార్ నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. వీరితోపాటు సంహిత సిద్ధాంత డిపార్ట్ మెంట్ డాక్టర్ సీహెచ్.రమాదేవి, స్వస్థతవృత్త డాక్టర్ రవీందర్ గౌడ్, ద్రవ్యగుణ డాక్టర్ ఏ.విజయలక్ష్మిల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆయా విభాగాల్లో సాధారణంగా రోజుకు ఎంతమంది ఇన్ పేషంట్లు ఉంటారు? అన్న వివరాలను సేకరించారు. ఈ పరిణామం ప్రస్తుతం ఆస్పత్రి వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారగా అవినీతికి పాల్పడ్డ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దాంతో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చటానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. దీనిపై విజిలెన్స్ వర్గాలతో మాట్లాడగా విచారణ కొనసాగుతోందన్నా
Also Read: Saradamma: శాస్త్రీయ సమాజ స్థాపనే ఆమె లక్ష్యం.. స్వప్న సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్