remedy ( Image Source: Twitter)
Viral

Natural Remedies: ఇవి మీ ఇంట్లో ఉంటే దోమలు పారిపోతాయ్.. అస్సలు కుట్టవు?

Natural Remedies: రాత్రి పడుకునే సమయంలో దోమలు మన చుట్టూ తిరిగి, కుట్టి, నిద్రను దూరం చేస్తాయి. ఈ ఆధునిక కాలంలో ఎన్ని రకాల దోమల ముందులు వాడినా, ఉపాయాలు వాడినా, దోమలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అవి అన్నింటికీ అలవాటు పడిపోయి, మనపై దాడి చేస్తూనే ఉన్నాయి. అయితే, కొన్ని సహజమైన వాసనలు దోమలను దూరం పెట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వెల్లుల్లి: వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటైన వాసన దోమలకు అస్సలు నచ్చదు. వెల్లుల్లిని ఎక్కువగా తినే వారి రక్తం దోమలకు ఇష్టం ఉండదట. ఈ వాసన వాటిని దూరం చేస్తుంది. కాబట్టి, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

వేపాకు: దోమలకు అత్యంత శత్రువైన వాసనల్లో వేపాకు వాసన ఒకటి. వేప నూనెను చేతులు, కాళ్లకు రాసుకుంటే దోమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఇది సహజమైన, సమర్థవంతమైన దోమలను తరిమికొట్టే మార్గం.

Also Read: Gadwal Jodu Panchelu: గద్వాల సంస్థానాధీశుల వారసులు.. ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు

పుదీనా: టీలలో, చూయింగ్ గమ్‌లలో సర్వసాధారణంగా వాడే పుదీనా ఆకులు దోమలను దూరం చేయడంలో కూడా మంచిగా పనిచేస్తాయి. పుదీనా నూనెను శరీరానికి అప్లై చేస్తే, దోమలు మీ దగ్గరకు కూడా రావు.

తులసి: తులసి ఆకుల వాసన కూడా దోమలకు అస్సలు ఇష్టం ఉండదు. మీ ఇంటి చుట్టూ తులసి చెట్టు నాటితే, దాని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. ఇది ఇంటిని పవిత్రంగా ఉంచడంతో పాటు, దోమల సమస్యనూ తగ్గిస్తుంది.

Also Read: Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల.. ప్రింట్ క్వాలిటీ అదిరింది.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

లవంగం: లవంగం నూనె లేదా లవంగాల వాసన కూడా దోమలను దూరం చేస్తుంది. లవంగ నూనెను చిన్న డిఫ్యూజర్‌లో వేసి గదిలో ఉంచడం లేదా శరీరానికి పూయడం ద్వారా దోమల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read: Tanikella Bharani: ‘మటన్ సూప్’ మూవీకి ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు కలగకూడదు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!