Baahubali The Epic: దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) చేసిన మ్యాజిక్ ‘బాహుబలి: ది బిగినింగ్’ (Bahubali: The Begining). ఈ సినిమా విడుదలై పదేళ్లయిన సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా కూడా మేకర్స్ ప్రకటించారు. కాకపోతే.. ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ అని విడివిడిగా కాకుండా.. రెండు భాగాలను కలిపి ఒకటే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి 1ని మంచి బాహుబలి 2 ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మొదటి పార్ట్‌లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే క్యూరియాసిటీని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడంతో రాజమౌళి వంద శాతం సక్సెస్ అయ్యారు. ప్రపంచం మొత్తం పార్ట్ 2 కోసం వేచి చూసేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ఒకటే పార్ట్‌గా రెండు సినిమాలు కలిసి వస్తున్నాయంటే.. కచ్చితంగా రాజమౌళి ఏదో ప్లాన్ చేసే ఉంటాడని అనుకోవచ్చు.
Also Read- Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!
రాజమౌళిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రాలు ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలు. అలాంటి సినిమా విషయంలో ఆయన ఎంత కేరింగ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఆయన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియదు. ఈ లోపు తన అభిమానులకు సరికొత్త ట్రీట్‌గా ఈ ‘బాహుబలి: ది ఎపిక్’ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మంగళవారం (ఆగస్ట్ 26) ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. మరోసారి అందరూ థియేటర్స్‌కు క్యూ కట్టడం పక్కా అనేలా అనిపిస్తుంది. ప్రభాస్ ఎలివేషన్ షాట్స్, రానా విలనిజం, అనుష్క ధీరత్వం, కట్టప్ప బానిసత్వం అన్ని కలగలిపి వదిలిన టీజర్.. ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతుంది.
రీ మాస్టర్డ్ అండ్ రీ కట్ పేరుతో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా భారీ స్థాయిలో చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్‌కు రాజమౌళితో పాటు చిత్ర ప్రధాన తారాగణం అంటే ప్రభాస్ (Prabhas), రానా దగ్గుబాటి (Rana Daggubati), అనుష్క (Anushka), తమన్నా (Tamannah) కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు ఎంత వీలైతే అంత జనాల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేయనున్నారు. ఇక ఇప్పుడొచ్చిన టీజర్ చూస్తుంటే అద్భుతమైన క్వాలిటీతో ఈ సినిమా రాబోతుందనేది తెలుస్తోంది. మొత్తానికి జక్కన్న గట్టిగానే ప్లాన్ చేశాడని.. నెటిజన్లు కూడా ఈ టీజర్ చూసి రియాక్ట్ అవుతుండటం విశేషం. చూద్దాం.. ఈ ఎపిక్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేయబోతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు