Brahmanda
ఎంటర్‌టైన్మెంట్

Brahmanda: బ్రహ్మాండ.. ఫస్ట్ టైమ్ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తోన్న సినిమా.. ఆసక్తికర విషయాలు చెప్పిన టీమ్

Brahmanda: ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆధ్యాత్మిక కథలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్ కూడా ఈ కథలకు దాసోహం అంటుంది. ‘కాంతార, కార్తికేయ2’ వంటి సినిమాలు దేశ వ్యాప్తంగా ఆదరణను రాబట్టుకుని బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాయి. ఒకవైపు పెద్ద సినిమాలు ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నాయో, మరోవైపు చిన్న సినిమాలు కూడా ఊహించని విధంగా సక్సెస్ అవుతూ.. ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంటున్నాయి. అలా ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకునే సినిమాగా ‘బ్రహ్మాండ’ (Brahmanda) సినిమా రాబోతుందని అంటున్నారు మేకర్స్. ఆగస్ట్ 29న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Sachin on Joe Root: సచిన్ రికార్డ్ చెరిపివేసే దిశగా జో రూట్.. తొలిసారి స్పందించిన సచిన్ టెండూల్కర్

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నటి ఆమని (Actress Aamani) మాట్లాడుతూ.. ‘బ్రహ్మాండ’ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాను అందరం ఎంతో ఇష్టంతో చేశాం. ఇంత మంచి సినిమాను డైరెక్ట్ చేసిన రాంబాబు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈ సినిమా సక్సెస్సే ఆయనకు ఇచ్చే నివాళి. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడాల్సింది కోరుకుంటున్నాను. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఇంత మంచి పాత్రకు నన్ను ఎంపిక చేసిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్ 29న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Also Read- Trolls on South Film Industry: సౌత్ హీరోలపై సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. వారికి అంత గర్వం పనికిరాదు!

హీరో బన్నీ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్ర పోషించాను. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్‌ని మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారని తెలిపారు. నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ… స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా.. అంతకుమించి చిత్రీకరించాం. మా డైరెక్టర్ ఇప్పుడు మా మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన ఉండి ఉంటే చాలా సంతోషించేశారు. ఆమని, బలగం జయరాం, కొమురక్క సహకారం మేము మరవలేము. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు.. ఈ సినిమా ఘన విజయం సాధించి, అందరికీ పేరు, నిర్మాతకు డబ్బులు తీసుకురావాలని కోరారు. కనీకావాధ్వ, చత్రపతి శేఖర్, అమిత్, దిల్ రమేష్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ కర్తానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ