PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు అద్భుతం
PV Sindhu
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సంచలనం

PV Sindhu: ఏకంగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన క్రీడాకారిణి, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) తిరిగి మునుపటి ఫామ్‌లోకి వచ్చింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. చైనాకు చెందిన వరల్డ్ నంబర్-2 క్రీడాకారిణి వాంగ్ జీ యీ‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-15 తేడాతో తిరుగులేని విజయం సాధించింది. రౌండ్-19‌లో సాధించిన ఈ అద్భుత విజయంతో సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇద్దరి మధ్య తొలి సెట్ హోరాహోరీగా జరిగినప్పటికీ, రెండో సెట్‌లో ప్రత్యర్థిపై సింధు దూకుడు ప్రదర్శించింది. రెండో సెట్‌ కూడా మొదట్లో హోరాహోరీగా మొదలైనా.. సింధు పుంజుకొని రాణించింది. సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2019 తర్వాత క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Read Also- UP Farmer: బతికున్నాడని నిరూపించుకోవడానికి 18 ఏళ్లు పట్టింది.. విజయం సాధించిన రైతు

గుర్తుకొచ్చిన మునుపటి సింధు!
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు అదరగొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం, 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ సాధించిన సమయంలో చూపించిన దూకుడునే సింధు మరోసారి చూపించింది. దీంతో, కసిగా, పట్టుదలగా ఆడుతూ కనిపించింది. దీంతో, మనుపటి ఫామ్‌‌తో పాత సింధుని గుర్తుచేసింది. నిజానికి వాంగ్ యీపై సింధు గెలుపు అవకాశాలు చాలా తక్కువని అంతా భావించారు. మ్యాచ్‌కు ముందు ఈ తరహా ఊహాగానాలే ఎక్కువగా వినిపించాయి. వ్యాఖ్యతలు కూడా ఆమెపై ఆశలు లేనట్టుగా మాట్లాడారు. చైనా ఓపెన్ గెలిచి, ఈ సీజన్‌లో ఏకంగా 6 ఫైనల్స్ ఆడిన వాంగ్ జీ యీ చేతిలో సింధు ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ సింధు చెలరేగిపోయింది.

Read Also- Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!

ఈ మధ్య కాలంలో వరుసగా ఫస్ట్ రౌండ్‌లోనే ఓటమిపాలవుతుండటంతో సింధు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాంగ్ జీ యీపై మ్యాచ్‌లో సింధూ ఈ పొరపాటుకు చెక్ పెట్టింది. తొలి సెట్‌ను హోరాహోరీగా ఆడి గెలుచుకుంది. ఇక, రెండో సెట్‌లో అయితే అలవోకగా ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక, క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ నంబర్-9 ప్లేయర్ పుత్రీ కుసుమా వార్దానీతో తలపడనుంది.

Read Also- Virender Sehwag: ఆ ముగ్గురు గేమ్ ఛేంజర్లు.. టీమిండియాపై సెహ్వాగ్ తొలి స్పందన

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!