Virender Sehwag: ఆసియా కప్ 2025 మరికొన్ని రోజుల్లోనే షురూ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో భారత జట్టుని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టీమ్‌లో వైఎస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. అయితే, వీరిలో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురూ ఆసియా కప్‌లో గేమ్ ఛేంజర్లు అవుతారని భారత క్రికెట్ దిగ్గజ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంచనా వేశాడు.
యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక గేమ్‌ఛేంజర్ అవుతాడని తనకు అనిపిస్తోందని సెహ్వాగ్ చెప్పాడు. ఇక, బుమ్రా ఎప్పుడూ గేమ్‌ఛేంజింగ్ ప్లేయర్ అని, వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ బౌలింగ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ఫార్మాట్‌లో కూడా అత్యంత ప్రభావవంత ఆటగాడిగా కొనసాగుతున్నాడని ప్రస్తావించాడు. ఈ ఆటగాళ్లకు మ్యాచ్‌లు గెలిపించగల సత్తా ఉందంటూ ‘సోనీ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ విశ్లేషించాడు. ఆసియా కప్ 2025 మరో 10 రోజుల్లో ప్రారంభమవనున్న నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఆసియా కప్ 2025లో టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
Read Also- Alekhya Chitti Pickles: కెరీర్ మీద ఫోకస్ పెంచిన పికిల్స్ బ్యూటీ.. అక్కడ రచ్చ చేయడానికి రెడీ
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అవసరమే..
ఇటీవల భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగిసిన నాటి నుంచి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అంశం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు అనే కారణం చూపుతూ జస్ప్రిత్ బుమ్రాను కేవలం మూడే టెస్టులకే పరిమితం చేయడం, కానీ, మహ్మద్ సిరాజ్‌ను 5 టెస్టుల్లోనూ ఆడించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తన వేళ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Read Also- Attack on Minister: బీహార్ మంత్రిని ఛేజ్ చేసి దాడికి పాల్పడ్డ గ్రామస్తులు.. ఎందుకంటే?
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా బౌలర్లకు అవసరమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, బ్యాట్స్‌మెన్లకు అంతగా అవసరం లేదని చెప్పాడు. బ్యాటర్ల కోణంలో చూస్తే మరీ అంతగా కష్టపడాల్సి ఉండదని, కానీ, బౌలర్లకు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరమనేది తన అభిప్రాయమని పేర్కొన్నాడు. పేసర్లను సరిగ్గా నిర్వహించగలిగితే, వాళ్లు ఎక్కువ కాలం పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించగలరని, భారత్‌కి ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ఎందుకంటే, ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో ప్రతిభావంతులైన ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటే, గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని సెహ్వాగ్ వివరించాడు.