Pujara Virat
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Virat Kohli – Pujara: పుజారా రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ

Virat Kohli – Pujara: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, అద్భుతమైన టెస్ట్ ప్లేయర్ చతేశ్వర పుజారా ఇద్దరూ (Virat Kohli – Pujara) చాలాకాలం కలిసి టెస్ట్ క్రికెట్ ఆడారు. ఈ ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు పలికిన కొన్ని నెలల తర్వాత, పుజారా కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి రిటైర్మెంట్‌పై విరాట్ తాజాగా స్పందించాడు. అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికిన సందర్భంగా పుజారాకు అభినందనలు తెలుపుతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. కొత్త బంతిని ఎదుర్కొని, మిడిలార్డర్ బ్యాటర్లకు మార్గం సుగమం చేశాడంటూ టీమిండియా పుజారా పాత్రను కొనియాడాడు. ఎంతో నిబద్ధతతో భారత జట్టుకు ఆడాడంటూ పొగిడాడు. పుజారా కారణంగానే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు తేలికైందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు.

Read Also- Swetcha Special story: వినూత్నంఉపాధ్యాయుని బోధన పద్ధతి.. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పాఠాల వివరణ

‘‘నాలుగో స్థానంలో నా బాధ్యతను సులభంగా మార్చిన నీకు ధన్యవాదాలు పుజ్జీ. నువ్వు అద్భుతమైన కెరీర్‌ కొనసాగించావు. ఇకపై గడపబోయే నీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు చెబుతున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’’ అంటూ విరాట్ భావోద్వేగంగా స్పందించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విరాట్ కోహ్లీ రాసుకొచ్చాడు.

కాగా, చతేశ్వర పుజారా టీమిండియాకు 13 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి అద్భుతమైన సేవలు అందించాడు. రెండేళ్లుగా చోటు దక్కకపోవడంతో గత ఆదివారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప్రకటించాడు. కాగా, పుజారా టెస్టు జట్టులో ఉన్నంత కాలం అద్భుతంగా రాణించాడు. కొత్త బంతిని ఎదుర్కొని ప్రత్యర్థి బౌలర్లకు అలసట వచ్చేలా చేసేవాడు. దీంతో, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లకు బ్యాటింగ్ సులభం అయ్యేది. పుజారా, 2010 అక్టోబర్ 9న బెంగళూరులో ఆస్ట్రేలియాపై మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 103 టెస్టులు ఆడి 43.60 సగటుతో 7,195 పరుగులు సాధించాడు. అందులో 19 సెంచరీలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 206గా (నాటౌట్) ఉంది. ఐదు వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. కానీ, 51 పరుగులు మాత్రమే సాధించాడు.

Read Also- Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల.. ప్రింట్ క్వాలిటీ అదిరింది.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

టెస్ట్ క్రికెట్‌లో పుజారా అద్భుతమై టెక్నిక్‌ను ప్రదర్శించాడు. పిచ్ స్వరూపాన్ని అర్థం చేసుకొని ఎక్కువసేపు నిలబడేవాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలను మాదిరిగా ఎక్కువ బంతులు ఎదుర్కొన్నాడు. పుజారా గొప్పతనం అతడు సాధించిన పరుగులకంటే ఎదుర్కొన్న బంతుల పరంగా ఉంటుందని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు. టెస్ట్ ఫార్మాట్‌లో ఏకంగా 16,217 బంతులు ఎదుర్కొన్నాడంటూ అతడి సత్తా ఏంటో అర్థమవుతోంది. 2010లో తన అరంగేట్రం నుంచి 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో పుజారా కంటే ఎక్కువ టెస్టు బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లు అంతర్జాతీయంగా నలుగురే ఉన్నారు. జో రూట్ 19,562 బాల్స్, అలెస్టర్ కుక్ 17,534, స్టీవ్ స్మిత్ 16,495, అజార్ అలీ 16,301 బంతులు ఎదుర్కొని పుజారా కంటే ముందున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!