Swetcha Special story: ఆసక్తికరమైన విద్య బోధన చేసేందుకు అంకిత భావంతో పని చేసే ఉపాధ్యాయులు కొత్త ఒరవడితో విద్య బోధన చేస్తూ విద్యార్థులలో ఆసక్తి పెంచేలా పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంలోని పాఠాలు అర్థం అయ్యేలా వివరిస్తూ సంపూర్ణమైన జ్ఞానం కలిగించేందుకు వారికి ఇష్టమైన పద్ధతుల్లో అవగాహన కలిగించడం, ప్రత్యక్ష పద్ధతిలో బోధనాభ్యసన ప్రక్రియలు రూపొందించడం కల్పించడం మరింత ఆసక్తిగా బోధనాభ్యసన సామాగ్రిని రూపొందించుకోవడం ఉపాధ్యాయునికి నిజమైన సవాలు. అటువంటి సవాల్ నే ఆసక్తిగా మార్చుకున్నాడు మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిషత్ ప్రాథమిక (ఫిల్టర్ బెడ్) పాఠశాలలో పని చేసే సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్. విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేలా నూతన బోధన పద్ధతిలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పై స్వేచ్ఛ స్టోరీ….
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
దుస్తులే బోధనోపకరణాలు
పరిసరాల విజ్ఞానంలో వివిధ పాఠ్యాంశాలను జీవితాంతం గుర్తుంచుకునేందుకు అనేక క్షేత్ర పర్యటన ద్వారా, ప్రత్యక్ష బోధనా పద్ధతులు ద్వారా విద్యార్థులకు సంపూర్ణ, సమగ్ర మూర్తిమత్వ వికాసానికి గత రెండు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మూడు సంవత్సరాలుగా మానవ శరీరం అంతర్గత- అవయవాలు అనే క్లిష్టమైన అంశాన్ని విద్యార్థులకు బోధించడం కోసం వినూత్నంగా “టీ షర్టులపై అంతర్గత అవయవాలు” ముద్రించి వాటి ద్వారా పిల్లలకు మరింత పరిపూర్ణ జ్ఞానాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నమే పాఠశాల పిల్లలను విజ్ఞాన వంతులను చేయడంతోపాటు శ్రీనివాస్ ను జాతీయస్థాయిలో బోధనోపకరణాల విభాగంలో “ఆజాదీ అమృతోత్సవాలలో “మన రాష్ట్రం నుంచి పోటీపడేలా చేశాయి. టీషర్ట్లపై అవయవాలు ముద్రించిన ఈ కాన్సెప్ట్ మన రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఒక బోధన ఉపకరణ సామాగ్రిగా అనేక మంది ఉపాధ్యాయులు తరగతి గదుల్లో బోధనోపకరణంగా ఉపయోగిస్తున్నారు.
సైన్స్ సంక్లిష్టం కారాదు – సరళం కావాలి
నా ప్రాజెక్ట్ వేలాది మంది విద్యార్ధులకు అభ్యసన సామాగ్రి కావడం చాలా సంతోషం. నిజంగా ఉపాధ్యాయునిగా నాకు గర్వకారణం. దీనికి కొనసాగింపుగా సంపూర్ణ మానవ శరీర అంతర్గత అవయవాలను విద్యార్థులకు మరింత సులభంగా అర్థం చేయించే క్రమంలో మొత్తం మానవశరీరం – అస్థిపంజరవ్యవస్థ, కండరాల వ్యవస్థ ,మెదడు -నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ,శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ,విసర్జన వ్యవస్థ వీటన్నిటిపై విద్యార్థులకు సంపూర్ణ జ్ఞానాన్ని అందించేందుకు ” అంతర్గత అవయవాలు ముద్రించిన మానవ శరీర ముసుగు – (అంతర్గత అవయవాలు ముద్రించిన ఫుల్ బాడీ సూట్ అనే నూతన ప్రయోగాన్ని మా విద్యార్థుల కోసం ఇప్పుడు వినూత్నంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ ప్రాజెక్టు తరగతి గదిలో మా విద్యార్థులకు మరింత సులభంగా నేర్చుకుని జ్ఞానాన్ని ఆర్జించే మార్గాన్ని అన్వేషించుకునే వెసులుబాటును పొందటం జరిగినట్లు ఆయింది.
ఉపాధ్యాయునిగా విద్యార్థులు మరింత సులభంగా నేర్చుకునేందుకు క్లిష్టమైన విషయాలను, సరళంగా చేయడం- “సైన్స్ అంటే సంక్లిష్టం కారాదు – సరళం కావాలి. మరింత సులభం కావాలనేదే నా అభిలాష. అభిమతం. ఆచరణ కూడా.. ఇదే నా బోధనారంగాన్ని సుసంపన్నం చేయుటకు తోడ్పడుతుందని తెలియజేయుటకు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. ఎందరో అహర్నిశలు నిబద్ధతతో పనిచేస్తూ, తమ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రాజెక్టు రూపకల్పనలో ఎంతో కష్టమైన బాడీ సూట్ కుట్టిన ఎమరాల్డ్ సత్యం, అవయవలను ముద్రించిన సప్తగిరి ఆర్ట్స్ రాజు, ప్రేమ్ లకు ఈ ప్రాజెక్టును అంకితం చేస్తున్నాను.
భీంపుత్ర శ్రీనివాస్, సైన్స్ ఉపాధ్యాయుడు
Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు