MS Dhoni
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Sports News: ఎంఎస్ ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

Sports News: మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకి భారతీయ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. అభిమానులు ప్రేమగా ‘కెప్టెన్ కూల్‌’ అని పిలుచుకుంటుంటారు. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి ఎన్నో అపురూప విజయాలు అందించి చక్కటి పేరు సంపాదించాడు. పలువురు యువక్రికెటర్లను జాతీయ జట్టులో (Sports News) ప్రోత్సహించాడు. అయితే, తనకు మాత్రం తీవ్ర అన్యాయం చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwari) ఆరోపించాడు.

ధోనీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు లభించలేదని, జట్టులో ఆటగాళ్ల ఎంపిక విషయంలో పక్షపాతం చూపించాడని ఆరోపించాడు. వెస్టిండీస్‌‌పై తాను తొలి వన్డే సెంచరీ సాధించానని, కానీ, ఆ తర్వాత తుది జట్టులో స్థానం కోల్పోయానని చెప్పాడు. కాగా, మనోజ్ తివారీ… ధోనీ నాయకత్వంలో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌, ఆ తర్వాత శ్రీలంక సిరీస్‌లోనూ చక్కగానే రాణించినప్పటికీ, మళ్లీ జట్టు నుంచి తివారీని తప్పించారు. నాడు తనకు ఎదురైన పరిస్థితిపై మనోజ్ తివారీ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సెంచరీ సాధించిన తర్వాత తొలగింపునకు ఎందుకు గురయ్యానో ఇప్పటికీ తనకు అర్థం కావడంలేదని, దీనిపై ధోనీని ప్రశ్నించాలనిపిస్తోందని చెప్పాడు.

Read Also- PM Modi – Trump: 4 సార్లు ఫోన్ చేసిన ట్రంప్.. మాట్లాడబోనన్న ప్రధాని మోదీ!

‘‘ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, దీనికి సమాధానం చెప్పగల వ్యక్తులు ఎవరంటే ఎంఎస్ ధోనీ, డంకన్ ఫ్లెచర్, లేదా సెలెక్టర్లే. వారి నుంచి ఇప్పటికీ నాకు ఎలాంటి సమాధానం రాలేదు’’ అని ‘క్రిక్‌ట్రాకర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారి పేర్కొన్నారు.

‘‘ జట్టులో చోటుదక్కనప్పుడు కెప్టెన్, కోచ్ లేదా సెలెక్టర్లకు ఫోన్ చేసి ‘నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో చెప్పండి’ అని అడిగే వ్యక్తిని నేను కాదు. కానీ, నేను ఇదివరకు కూడా చెప్పినట్టుగానే, ఎప్పుడైనా ఎంఎస్ ధోనీ ఎదురుపడితే తప్పకుండా ఈ ప్రశ్న అడుగుతాను. సెంచరీ కొట్టిన తర్వాత నాకు మరో అవకాశమే ఎందుకు ఇవ్వలేదో, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పట్లో వాళ్ల ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో కూడా నాకు తెలియదు. ఆ సమయంలో నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదనేది నిర్ణయాలు తీసుకున్న వారినే అడగాల్సిన ప్రశ్న’’ అని మనోజ్ తివారి వ్యాఖ్యానించాడు.

Read Also- Ajith Doval: అండర్‌కవర్ ఏజెంట్‌గా పాక్‌లో ఉండి.. రహస్యాన్ని కనిపెట్టిన అజిత్ దోవల్

‘‘కొన్ని విషయాల్లో ధోనీ పక్షపాతం చూపించాడు. నాకు మద్దతివ్వలేదు. నన్ను ఇష్టం లేని వ్యక్తిగా భావించి ఉండొచ్చు. అందరూ ఎంఎస్ ధోనీని ఇష్టపడతారు. కెప్టెన్‌గా ఎంత గొప్పవాడో కాలక్రమంలో నిరూపించుకున్నాడు. అది నేను ఎప్పుడూ అంగీకరిస్తాను. కానీ, నా విషయంలో మాత్రం, ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది ధోనీ ఒక్కడే. అప్పట్లో అతడికి బాగా ఇష్టమైన కొంతమందికి మాత్రం సంపూర్ణ మద్దతు ఇచ్చాడని నాకు అనిపిస్తోంది. చాలా మందికి ఇది తెలిసిన విషయమే. కానీ, అందరూ బయటకు వచ్చి మాట్లాడరు. క్రికెట్‌లో ఇష్టాలు, అసహ్యాలు అనేవి చాలా బలంగా నాటుకుపోయి ఉంటాయి. నాకు మాత్రం ధోనీ నన్ను ఆదరించలేదని అనిపిస్తుంది. అది మాత్రం నేను చెప్పగలను’’ తివారీ పేర్కొన్నాడు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు